నల్లగొండ జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ..పలు రైళ్ల నిలిపివేత

నల్లగొండ జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ..పలు రైళ్ల నిలిపివేత

నల్లగొండ జిల్లాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.  జిల్లాలోని దామరచర్ల మండలం విష్ణుపుంర వద్ద గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో వెళ్లే శబరి ఎక్స్ ప్రెస్ ను మిర్యాలగూడ వద్ద నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద అధికారులు నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపు తున్నారు.