జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు వార్నింగ్.. ఈ పని చేయకపోతే అంతే సంగతి..!

జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు వార్నింగ్.. ఈ పని చేయకపోతే అంతే సంగతి..!

మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా..? యూట్యూబ్ అకౌంట్లను వాడుతున్నారా..? అయితే బీ అలర్ట్.. మీకు హెచ్చరిక జారీ చేసింది ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్. ఏ క్షణమైన మీ అకౌంట్లను డిలీట్ చేయవచ్చు. కొన్ని వారాల క్రితమే ఇన్‌యాక్టివ్ అకౌంట్ల విధానాలపై ముఖ్యమైన అప్‌డేట్ ప్రకటించింది గూగుల్. యూట్యూబ్, జీమెయిల్ అకౌంట్లు వాడుతున్న వారికి గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. కనీసం రెండేళ్లుగా ఉపయోగించని లేదా సైన్ ఇన్ చేయని గూగుల్ అకౌంట్లను డిలీట్ చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. 

ఇన్ యాక్టివ్ పాలసీలో మార్పులు చేసిన గూగుల్.. యూజర్లకు వార్నింగ్ మెసేజ్‌లు పంపుతోంది. వెంటనే ఆయా ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని... లేదంటే వాటిని తొలిగిస్తామని పేర్కొంది. ఇన్ యాక్టివ్ అకౌంట్లు సులభంగా హ్యాకింగ్‌కు గురి అవుతున్నాయనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. అకౌంట్లను డిలీట్ చేసే ముందు.. వినియోగదారులకు వరుసగా అకౌంట్ ఇ మెయిల్ అడ్రస్, రీస్టోర్ ఇమెయిల్ రెండింటికీ మల్టీ నోటిఫికేషన్‌లను పంపుతామని గూగుల్ చెబుతోంది.

గూగుల్ కొత్త విధానంతో యూజర్ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంగా ఇన్‌యాక్టివ్ అకౌంట్లను నిర్వహించడం వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. ఈ కొత్త విధానంతో డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తుందని గూగుల్ పేర్కొంది. అకౌంట్లను డిలీట్ చేసే ప్రమాదం ఉన్న యూజర్లను అప్రమత్తం చేసేందుకు కంపెనీ 8 నెలల ముందుగానే వార్నింగ్ ఇమెయిల్‌లను పంపుతుంది. సెక్యూరిటీ మెరుగుపర్చేందుకు రెండేళ్లుగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను తొలగించాలని గూగుల్ యోచిస్తోంది.