సరిహద్దులపై‘గూగుల్‌ ’ వివాదం

సరిహద్దులపై‘గూగుల్‌ ’ వివాదం

ఎవరి ముందుంటే వాళ్లకు అనుకూలంగా మాట్లాడే టోళ్లను ‘ఏ రోటికాడ ఆ పాట’ పాడుతున్నారని అంటుంటాం . ఈ విషయాన్నిగూగుల్‌‌‌‌ బాగా వంట బట్టించుకున్నట్టుంది. ఏ దేశంలో నుంచి గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేస్తే .. ఆ దేశానికి అనుకూలంగానే బోర్డర్స్‌‌‌‌ను గూగుల్‌‌‌‌ చూపిస్తోంది మరి. ఇక మన దేశంలో ఉండి గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేస్తే.. కాశ్మీర్ స్ఫూర్తిగా ఇండియాలోనే ఉన్నట్టుగా, బయటి దేశాల నుంచి సెర్చ్ చేస్తే మాత్రం ‘డిస్ప్యూటెడ్(వివాదాస్పదం)’గా చూపిస్తోంది. వాషింగ్టన్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ అనే ఇంటర్నేషనల్‌‌‌‌ పేపర్‌‌‌‌ ఈ విషయాన్ని వెల్లడించింది. పాకిస్తాన్ నుంచి చూస్తే కాశ్మీర్ ఔట్‌‌‌‌లైన్ డిస్ప్యూ టెడ్‌‌‌‌గా కన్పిస్తోందని తెలిపింది. అలాగే అర్జెంటినా నుంచి యూకే, ఇరాన్ దాకా గూగుల్ మ్యాప్స్‌‌‌‌లో ఆయా దేశాల బోర్డర్లు మారిపోతున్నాయని పేర్కొం ది. అయితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు డిస్ప్యూటెడ్‌‌‌‌గా ప్రకటించిన ప్రాంతాలను పక్షపాతం లేకుండా చూపించడమే తమ పాలసీ అని గూగుల్ ప్రతినిధి ఒకరు వివరణనిచ్చారు. లోకల్ చట్టాలకు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాలనే తాము ఈ పాలసీని అనుసరిస్తున్నామని చెప్పారు.2014లో తెలంగాణ ఏర్పడిన వెంటనే గూగుల్ మాప్స్ లో దానిని కూడా అప్డేట్ చేశామని, అప్డేషన్ లో తాము ఎప్పుడూ ముందుంటామన్నారు.