న్యూ లుక్ లో గూగుల్ ఫొటోస్

న్యూ లుక్ లో గూగుల్ ఫొటోస్

ఇటీవలే ‘గూగుల్ ప్లస్’ సేవల్ని నిలిపి వేసిన గూగుల్ ‘ఫొటోస్’ యాప్ లో కూడా మార్పులకు శ్రీకారం చుట్టింది. గూగుల్ ఫొటోస్ బ్యాక్ గ్రౌండ్ లో ఓ కవర్ ఫొటో ఉంటుంది. దీన్ని తొలగించి, యాప్ చాలా నీట్ గా కనిపించేందుకు ప్రయత్ని స్తోంది. దీనికి సంబంధించి టెస్టింగ్ ను గూగుల్ నిర్వహిస్తోంది. ఇది విజయవంతమైతే కొత్త అప్ డేట్ వెర్షన్ మరిన్ని ఫీచర్లతోపాటు అందుబాటులోకి వస్తుంది. సైడ్ బార్ లో కనిపించే ‘నౌ ఇన్ ద షేరింగ్ ట్యాబ్’ ఆప్షన్ ను తొలగిస్తోంది. ‘సెండ్ ఫీడ్ బ్యాక్’ స్థా నంలో ‘హెల్ప్​ అండ్ ఫీడ్ బ్యాక్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మార్పులతో త్వరలోనే కొత్త లుక్కులో ‘గూగుల్ ఫొటోస్’ అందరు యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.