Google Layoffs : 12వేల మంది ఆల్పాబెట్ ఉద్యోగుల తొలగింపు

Google Layoffs : 12వేల మంది ఆల్పాబెట్ ఉద్యోగుల తొలగింపు

ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఎంప్లాయిస్ కు పింక్ స్లిప్పులు ఇస్తుండగా.. తాజాగా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఆ లిస్టులో చేరింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న12వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ నిర్ణయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం నుంచి తొలగిస్తున్న వారి సంఖ్య ఆల్ఫాబెట్ మొత్తం ఉద్యోగుల్లో 6శాతం ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 

గూగుల్ ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల్లో 10వేల మందిని తొలగించిన కొన్ని రోజులకే ఆల్పాబెట్ ఈ ప్రకటన చేయడం విశేషం. కంపెనీ తొలగించనున్న 12 వేల మందిలో రిక్రూట్ మెంట్, కార్పొరేట్ ఫంక్షన్స్, ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీమ్ సభ్యులు ఉన్నారు.  ఉద్యోగుల తొలగింపు ప్రభావం అమెరికాలో తక్షణం ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. విధుల నుంచి తొలగించనున్న  ఉద్యోగులకు ఇప్పటికే ఈ మెయిల్ పంపినట్లు ఆల్ఫాబెట్ ప్రకటించింది. స్థానిక చట్టాల కారణంగా కొన్ని దేశాల్లో ఈ నిర్ణయం అమలు ఆలస్యం కావచ్చని చెప్పింది. 

కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ట్విట్టర్ ఇప్పటి వరకు 50శాతం ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. మైక్రోసాఫ్ట్ 10వేలు, అమెజాన్ 18వేలు, మెటా 11 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది.