పిక్సెల్ ఫోన్ హ్యాక్ చేస్తే రూ.11 కోట్లు.. గూగుల్ ఆఫర్

పిక్సెల్ ఫోన్ హ్యాక్ చేస్తే రూ.11 కోట్లు.. గూగుల్ ఆఫర్

గూగుల్, ఫేస్‌బుక్ సహా పలు టెక్ దిగ్గజాలు వాళ్ల యాప్స్, సాఫ్ట్‌వేర్‌లలో లోపాల్ని ఎత్తి చూపితే భారీగా డబ్బులు ఇవ్వడం రొటీన్‌గా జరిగేదే. టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌లు, ఎథికల్ హ్యకర్లు వాటి లూప్ హోల్స్ బయటపెట్టి ఆ బంపర్ గిఫ్టులు కొట్టేస్తుంటాయి. ఇది తమ లోపాల్ని చూపించాలని చాలెంజ్ విసిరి.. కానుకలు ఇవ్వడం లాంటిది. ఇలాంటి ఆఫర్‌ ఇప్పుడు మరోసారి గూగుల్ ప్రకటించింది.

గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌ను హ్యాక్ చేసి.. లోపాల్ని కోడింగ్‌తో సహా చూపించాలని సవాల్ విసిరింది. పిక్సెల్ ఫోన్‌లలో ఉండే టైటాన్ ఎం చిప్‌ సెక్యూరిటీని బ్రేక్ చేసి దాన్ని కరాబ్ చేయగలిగితే రూ.7 కోట్లు ఇస్తామని ఇటీవలే ప్రకటించింది. ఇవాళ ఆ మొత్తాన్ని భారీగా పెంచింది. చిప్ సెక్యూరిటీని బ్రేక్ చేయడంతో పాటు తమ ఆండ్రాయిడ్ వర్షన్‌లోని లోపాలను బయపెట్టి, హ్యాక్ చేయగలిగితే ఆ ఏడు కోట్లకు అదనంగా మరో నాలుగు కోట్లు కలిపి మొత్తం రూ.11 కోట్లు ఇస్తామని ప్రకటించింది.

టెక్ ఎక్స్‌పర్ట్‌లు, హ్యాకింగ్ తెలిసిన వాళ్లు ట్రై చేసుకోవచ్చు. ఎవరు గూగుల్ ఫోన్లలో లోపాల్ని బయటపెట్టినా ఈ సొమ్ము గెలుచుకోవచ్చు.

MORE NEWS: 

రెడ్ అలెర్ట్: ఈ 40 రకాల మెయిల్స్ వస్తే ఓపెన్ చేయొద్దు

కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు: అమెరికా డాక్టర్ సలహా

త్వరలో గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్‌