V6 News

గూగుల్ వాలెట్లో ఆధార్ కార్డును భద్రంగా ఇలా దాచుకోండి !

గూగుల్ వాలెట్లో ఆధార్ కార్డును భద్రంగా ఇలా దాచుకోండి !

న్యూఢిల్లీ: ఆధార్ కార్డును, దాని వివరాలను గూగుల్ వాలెట్‌‌‌‌‌‌‌‌లో భద్రంగా దాచుకోవచ్చని కంపెనీ​ ప్రకటించింది. దీనివల్ల ఇంటర్నెట్ సేవల్లో గుర్తింపు నిరూపించుకోవడం సులభం అవుతుంది. యూఐడీఏఐ భాగస్వామ్యంతో ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. సినిమా హాళ్లలో వయస్సు ధ్రువీకరణకు, భారత్ మ్యాట్రిమోనీ వంటి వెబ్ సైట్లలో ఖాతాల వెరిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది.

అట్లిస్ వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా అంతర్జాతీయ వీసా దరఖాస్తులను కేవలం ఒక్క ట్యాప్‌‌‌‌‌‌‌‌తో పూర్తి చేయడానికి ఈ వాలెట్​ తోడ్పడుతుంది. భద్రత గోప్యతకు పెద్దపీట వేస్తూ సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో నిక్షిప్తం చేస్తామని గూగుల్ వెల్లడించింది. ఇతర దేశాల్లో పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్ సమాచారంతో ఐడీ పాస్‌‌‌‌‌‌‌‌లు సృష్టించే సదుపాయం ఇప్పటికే ఉండగా, భారత్‌‌‌‌‌‌‌‌లో ఆధార్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చారు.