సిధ్దూ కోసం పాక్ ప్రధాని మెసేజ్

సిధ్దూ కోసం పాక్ ప్రధాని మెసేజ్

చండీగఢ్: పంజాబ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక కసరత్తులతో బిజీబిజీగా ఉన్నాయి. అదే సమయంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవ్ జోత్ సింగ్ సిధ్దూపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కెప్టెన్ అమరిందర్ సింగ్ ఇవాళ ప్రెస్‌ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిధ్దూను తన కేబినెట్ లోకి తీసుకోవాలని పాకిస్థాన్ ప్రధాని నుంచి తనకు మెసేజ్ వచ్చిందన్నారు.

'అవకాశం ఉంటే సిధ్దూను నా ప్రభుత్వంలోకి తీసుకోవాలని కోరుతూ పాక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే ఆయన్ను తొలగించాలనేది ఆ మెసేజ్ సారాంశం' అని అమరిందర్ చెప్పారు. పాక్ ప్రధాని నుంచి ఈ మెసేజ్ అందిందన్నారు. సిద్ధూ తనకు చిరకాల మిత్రుడని ఆ మెసేజ్ లో పాక్ ప్రధాని పేర్కొన్నారని కెప్టెన్ వివరించారు.

మరిన్ని వార్తల కోసం..

పార్టీ కోసం పనిచేసినోళ్లకే ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్

మెడికల్ షాపుల్లోకంటే.. ఆన్ లైన్ లో తక్కువ ధరకే మెడిసిన్​