Family Star: విజయ్ ఫ్యామిలీ స్టార్కి..ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?

Family Star: విజయ్ ఫ్యామిలీ స్టార్కి..ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?

స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (Family Star). సీతారామం(Sitaramam)ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు (Dil raju) నిర్మిస్తున్నారు.

రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్,ట్రైలర్,సాంగ్స్ ఆడియన్స్ని వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్తో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచేశారు.దీంతో తాజాగా విజయ్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.అందులో భాగంగా ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో రివీల్ చేశాడు.మరి ఆ టైటిల్ ఏమైంటుందో చూద్దాం.   

నిజానికి మేకర్స్ ఈ మూవీకి ముందుగా 'గోవర్ధన్'(Govardhan)అనే టైటిల్ని అనుకున్నారంట.మరి ఈ టైటిల్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.."ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు గోవర్ధన్.ట్రైలర్లో చూస్తున్నట్టుగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ పనుల వరకు..తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి ఎంత వరకైనా వెళ్ళడానికి..తనని తాను తగ్గించుకోవడానికి రెడీ అయ్యే వ్యక్తిగా కనిపిస్తున్నాడు విజయ్. అలా కుటుంబానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చే క్యారెక్టర్ కావడంతో గోవర్ధన్ లాంటి వాడు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నారు.అందుకే ముందుగా ఈ టైటిల్ని మేకర్స్ అనుకున్నారంట.

అంతేకాదు..ఇక్కడ మరో విశేషం ఉంది.అదేంటంటే..విజయ్ దేవరకొండ తండ్రి పేరు కూడా గోవర్ధన్.ఇక ఆల్మోస్ట్ ఇదే టైటిల్ అనుకునేలోపు..పబ్లిక్కి మరింత దగ్గరగా అండ్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెడితే బాగుంటుందని పునరాలోచలనలో పడ్డారంట టీమ్.

ఫ్యామిలీని సంతోషంగా ఉంచాలని అనుకునే ప్రతి వాడు ఒక ఆ ఫ్యామిలీకి స్టారే కదా..అని మేకర్స్ ఈ ఫ్యామిలీ స్టార్ క్యాచీ టైటిల్ ని ఫిక్స్ అయ్యారంట.క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మరో రెండ్రోజుల్లో (ఏప్రిల్ 5న)థియేటర్లోకి వస్తోన్న ఫ్యామిలీ స్టార్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

  • Beta
Beta feature