పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే: లారీ క్లీనర్ కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే: లారీ క్లీనర్ కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం

సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరికి అసాధ్యమైంది ఏమీ ఉండదనినే నిరూపించాడు నల్లగొండకు చెందిన బాసాని రాకేష్. పేద కుటుంబంలో పుట్టి.. ఎన్నో అవాంతరాలు, కష్టాలు, సవాళ్లు ఎదుర్కొని చివరకు గవర్నమెంట్ కొలువు సాధించాడు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు ఎంపిక కాగా.. గురువారం (మే 8) సచివాలయంలో అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. 

నల్లగొండ జిల్లా అశోక్ నగర్‎కు చెందిన బాసాని రాకేష్‎ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రాకేష్ తండ్రి లారీ క్లీనర్. కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్న రాకేష్ చిన్నప్పుటి నుంచి కష్టపడి చదివేవాడు. పీజీ కంప్లీట్ చేసి  ప్రస్తుతం గురుకులలో పార్ట్ టైం టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్‎గా పని చేస్తున్నాడు. ఓ వైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్ష రాశాడు.

►ALSO READ | ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ సెంటర్లు.. రాష్ట్రంలో 80 ట్రామా సెంటర్లు: మంత్రి దామోదర రాజనర్సింహ

 అద్భుతంగా పరీక్ష రాసిన రాకేష్ 203 మార్కులు సాధించి జాబ్ కొట్టాడు. 203 మార్కులతో స్టేట్ 62, జోనల్ స్థాయిలో 18 ర్యాంక్ సాధించాడు. గురువారం (మే 8) సచివాలయంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. రాకేష్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.