సర్కారు భూమిని ఎంపీపీ భర్త కబ్జా చేశాడంటూ.. 

సర్కారు భూమిని ఎంపీపీ భర్త కబ్జా చేశాడంటూ.. 
  • సర్పంచ్ సహా వివిధ పార్టీ నాయకుల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా:  సంస్థాన్ నారాయణపురం మండలంలో ప్రభుత్వ భూమని ఎంపీపీ భర్త ఆక్రమించాడంటూ సర్పంచ్, వివిధ పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. అయితే ఎంపీపీ మాత్రం భూమిని తాను కొనుగోలు చేశానని అంటున్నాడు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయంటున్నారు. ఈ గొడవ జరుగుతున్న ప్రాంతంలో టెన్త్ పరీక్ష కేంద్రం ఉండటంతోపాటు అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది.  విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎంపీపీ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆందోళన చేపట్టిన సర్పంచ్, పంచాయతీ సెక్రటరీతో పాటు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడానికి ప్రయత్నం చేస్తున్న తమపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సర్పంచ్ శ్రీహరి. తనపై బురద చల్లడానికి అధికార పార్టీలోని ఓ వర్గం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రేమేందర్ రెడ్డి.

 

 

ఇవి కూడా చదవండి

నేతల ఇళ్ల మీద దాడి చేసిన వారిపై.. అట్రాసిటీ కేసులు పెట్టాలి

ముందస్తు అరెస్ట్ చేసినా ఆగని రైతుల నిరసనలు

ఎన్నికల వార్​లో సోషల్​ సైన్యం

ఆదివారాలు, పండుగల రోజుల్లో డ్యూటీలకు హాజరుకాలేదని.. 57 మంది డాక్టర్లకు మెమోలు జారీ