పేదలకు కార్పొరేట్​ వైద్యం

పేదలకు కార్పొరేట్​ వైద్యం

నారాయణపేట, వెలుగు; రాజీవ్​ ఆరోగ్యశ్రీలో భాగంగా కార్పొరేట్​ ఆస్పత్రుల్లో పేదలకు రూ.5లక్షల పరిమితి నుంచి రూ.10లక్షలకు కాంగ్రెస్​ ప్రభుత్వం  పెంచిందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని జాజాపూర్​ గ్రామంలో పీహెచ్​సీ సబ్ సెంటర్​ను సర్పంచ్​ సుగంధ జగన్​మోహన్​రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఎమ్మెల్యే డాక్టర్ కావటంతో పలువురు పేషెంట్ల ఆరోగ్యాన్ని పరిశీలించారు. అంతుకుముందు  మండలంలోని లోకపల్లి లక్ష్మమ్మ దేవాలయం, లింగంపల్లి ఎల్లమ్మ దేవతకు, తిరుమల దేవునిపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి ఇలవేల్పు చిన్న రాజమూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

నారాయణపేటలోని అమరేశ్వర దేవాలయంలో శివలింగానికి అభిషేకం, మెట్టుగడ్డ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో డీఎంహెచ్​ఓ సౌభాగ్య లక్ష్మి, ఎంపీటీసీ శేఖర్,  సదాశివారెడ్డి, కోట్ల జగన్ మోహన్ రెడ్డి, బండి వేణుగోపాల్, కోట్ల రవీందర్ రెడ్డి, ఎండి గౌస్, జనార్దన్ గౌడ్, బీమ్ ప్రకాశ్, అఖిల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.