
పదో తరగతి మంచి మార్కులతో పాసైన స్టూడెంట్లకు ఇంటర్‌లో సున్నా మార్కులు ఎట్లొస్తయని గవర్నర్నరసింహన్ విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇంటర్‌మార్కుల వ్యవహారంలో దొర్లిన తప్పిదాలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాథమిక, ఇంటర్, విద్యాశాఖలపై గవర్నర్సోమవారం రాజ్‌భవన్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. ఇంటర్మార్కుల్లో పొరపాట్లకు బాధ్యులన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని గవర్నర్అధికారులను అడిగారు. ఈ విషయంపై హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చిందంటూ బోర్డు సెక్రటరీ అశోక్‌కుమార్ చెప్పేందుకు ప్రయత్నించగా.. భవిష్యత్తులో ఈ తప్పులు రిపీట్‌కాకుండా చూసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ఫీజుల వ్యవహారంపైనా గవర్నర్ఆరా తీశారు. తర్వాత యూనివర్సిటీల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని, విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని, అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని అధికారులకు గవర్నర్సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.