షాకింగ్ : రూ.12 వేల కోట్లు ఇంకా రాలే..

షాకింగ్ : రూ.12 వేల కోట్లు ఇంకా రాలే..

రెండు వేల నోట్ల మార్పిడికి అక్టోబర్ ఇవాళే (అక్టోబర్ 7 )లాస్ట్ డేట్.  అయితే ఇప్పటి వరకు  డిపాజిట్లు, ఎక్స్చేంజి మార్గంలో 87 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని  ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.   సుమారు రూ.12 వేల కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఇంకా బ్యాంకుల్లోకి రాలేదని  వెల్లడించారు. అక్టోబర్ 8 నుండి 19 వరకు ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2 వేలనోట్లు  ఉపసంహరించుకోవచ్చు.

వ్యవస్థలోని రూ.2 వేల నోట్లను విత్‌‌‌‌డ్రా చేసుకుంటామని ఈ ఏడాది మే 19 న ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది. మే 19 న ఉపసంహరణ  ప్రకటించే సమయంలో   రూ.3.56 లక్షల కోట్ల  రెండు వేల రూపాయిల నోట్లు సర్క్యులేషన్‌‌‌‌లో ఉన్నాయని చెప్పారు.  అందులో 3.43 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయని తెలిపారు.

రూ. 2 వేల నోట్ల డిపాజిట్ కోసం మే 23, 2023 నుంచి అవకాశం కల్పించింది ఆర్బీఐ.  నోట్ల మార్పిడికి నాలుగు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. అయితే ఆ గడువు ముగిసేలోగా మరో అవకాశం  కల్పిస్తూ  అక్టోబర్ 7 వరకు పొడిగించారు.