జవాన్ యాదయ్య భార్యకు గవర్నమెంట్​ జాబ్

జవాన్ యాదయ్య భార్యకు గవర్నమెంట్​ జాబ్

వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జవాన్​ మల్లెపాకుల యాదయ్య 2013లో వీరమరణం పొందగా, ఆయన భార్య సుమతమ్మకు రెవెన్యూ శాఖలో జూనియర్​ అసిస్టెంట్​గా ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదయ్య కుటుంబానికి అప్పటి ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం, కల్వకుర్తి పట్టణంలో 165 గజాల ఇంటి స్థలం ఇచ్చారు.

అప్పటి నుంచి వచ్చే పెన్షన్ తో ఇద్దరి పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. యాదయ్య కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కలెక్టర్ తో మాట్లాడి ఉద్యోగం ఇప్పించారు.

జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగాన్ని ఇస్తూ కలెక్టర్ ఉదయ్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఆమె చారగొండ తహసీల్దార్  ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్  కానున్నారు. సీఎం చొరవతో తనకు ఉద్యోగం వచ్చిందని సుమతమ్మ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జవాన్​ భార్యకు ఉద్యోగం ఇవ్వడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.