గ్రీన్ మిర్చి హల్వా..ఈ స్పైసీ ఫుడ్ వీడియో వైరల్

గ్రీన్ మిర్చి హల్వా..ఈ స్పైసీ ఫుడ్ వీడియో వైరల్

స్వీట్ హల్వా గురించి మనందరికి తెలుసు. ఇది భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో దొరకే మిఠాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంటారు. కేరళ రాష్ట్రం హాల్వా తయారీకి చాలా ప్రసిద్ధి. క్యారట్  హల్వా, బీట్ రూట్ హల్వా, కేసరీ హల్వా, బాదం హల్వా ఇలా స్వీట్ గా బెల్లం, చెక్కెర తో హల్వా తయారు చేస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా మిర్చి హల్వా కూడా తయారు చేశారు కేరళ ఫుడ్ మేకర్స్.. 

గ్రీన్ మిర్చి హల్వా పేరుతో ఈ విచిత్రమైన వంటకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోజికోడ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ కు చెందిన వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ఇది స్పైసీ హల్వానుఎలా తయారు చేయాలో చూపిస్తుంది.. ఓ లుక్కేద్దాం పదండి.. 

ఈ వీడియోలో మిర్చి, చక్కెర పేస్టులో పాలు కలుపుతున్నట్లు కనపడుతుంది. ఆ తర్వాత గ్రీన్ మిర్చి హల్వా తయారీ విధానాన్ని చూపిస్తుంది. మిరపకాయలు తరిగిన దగ్గర నుంచి చూర్ణం చేసి చక్కెర కలిపే వరకు స్వీట్ హల్వా కి భిన్నంగా ఈ గ్రీన్ మిర్చి హల్వాతయారు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. 

ఈ గ్రీన్ మిర్చీ హల్వా తయారీలో మొదట మిర్చిని ముక్కలుగా చేసి వాటిని వేడిచేసిన పాన్ పై వేయించారు. తర్వాత ఇది సబ్జీ వంటకంగా అనిపిస్తుంది. దీనికి చక్కెర కలిపి ఆ తర్వాత మరిన్ని పదార్ధాలు కలిపారు. పాలు, కొబ్బరి నూనె, యాలకులు కలుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. బాగా ఉడికి చిక్కబడిన తర్వాత దానికి పాత్రలోకి తీసుకొని హల్వా రూపంలో తయారు చేస్తున్నట్టు వీడియోలో చూపించారు. 

Also read :Viral Video: వామ్మో.. లండన్ రోడ్లపై యువతి లుంగీతో హల్ చల్ 
 

ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియో క్లిప్ పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. పచ్చి మిర్చి హల్వాతో స్పైసీ ఫుడ్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. స్వీట్ ఇష్టపడే వారు నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.. నిజంగా ఇది గ్రీన్ మిర్చితో తయారుచేసిన హల్వానేనా.. లేక ఇంటర్నెట్ సృష్టించిందా అని ఓ నెటిజన్ తన డౌట్లు వ్యక్తం చేశారు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. ఇది బేకార్ గా ఉంది అని రాశారు.  కొందరు గ్రీన్ మిర్చి తో హల్వానా.. గిదేంది.. అన్నట్టు తమ అయిష్టతను సూచించే ఫేస్ పామ్ ఎమోజీలను కూడా షేర్ చేశారు.