రాజ్కోట్ గేమ్ జోన్లో అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు విచారణ

రాజ్కోట్ గేమ్ జోన్లో అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు విచారణ

రాజ్ కోట్ గేమ్ జోన్ లో అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు విచారణకు ఆదేశించింది. సుమోటొగా కేసు స్వీకరించిన కోర్టు.. జస్టిస్ బీరెన్ వైష్ణవ్, దేవన్ దేశాయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసింది. సరైన అనుమతులు లేకుండానే గేమింగ్ జోన్ ఏర్పాటు చేసినట్లు స్పెషల్ బెంచ్ తెలిపింది. అగ్నిప్రమాదానికి మానవ నిర్లక్ష్యమే కారణంగా ప్రాథమికంగా గుర్తించింది. రేపు విచారణకు అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. 

గుజరాత్ లోని రాజ్ కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.  ఇప్పటివరకు 35మంది మృతి చెందారు. మృతుల్లో 12ఏళ్లలోపు చిన్నారులు నలుగురు ఉన్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పరిశీలించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. నిన్న సాయంత్రం రాజ్ కోట్ లోని TRP గేమ్ జోన్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో సందర్శకులు ఎటూ వెళ్లలేకపోయారు.