దర్శకుడు గుణశేఖర్ కొత్త సినిమా ‘యుఫోరియా’.. ఫస్ట్ సింగిల్‌‌ రిలీజ్

దర్శకుడు గుణశేఖర్ కొత్త సినిమా ‘యుఫోరియా’.. ఫస్ట్ సింగిల్‌‌ రిలీజ్

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూత్‌‌ఫుల్ సోషల్ డ్రామా ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మిస్తున్నారు.  విఘ్నేశ్ గ‌‌విరెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో భూమిక, సారా అర్జున్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా,  మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా  ‘ఫ్లై హై’ అంటూ  ఫస్ట్ సింగిల్‌‌ను రిలీజ్ చేశారు. కాల భైరవ కంపోజ్ చేసిన ఈ ట్రెండీ సాంగ్‌‌కు కిట్టు విస్సా ప్రగడ క్యాచీ లిరిక్స్ అందించాడు. కాల భైరవ, పృథ్వీ చంద్ర, గాయత్రి నటరాజన్ కలిసి పాడిన తీరు యూత్‌‌కు కనెక్ట్‌‌ అయ్యేలా ఉంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌లో గుణ శేఖర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా డిఫరెంట్‌‌గా ఉంటాయి.  కంప్లీట్ యూత్‌‌ఫుల్ బ్యాక్‌‌డ్రాప్‌‌తో ఈ మూవీని తీస్తున్నా. ఆడియెన్స్‌‌ను ఏ మాత్రం నిరాశపర్చదని  భావిస్తున్నా’ అని అన్నారు. యూత్‌‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని హీరో విఘ్నేష్ గవిరెడ్డి  చెప్పాడు. ఈ పాటకు మంచి బజ్ రావడం ఆనందంగా ఉందని నిర్మాత నీలిమ గుణ అన్నారు. ఇందులోని పాటలన్నీ అందరికీ నచ్చుతాయని మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ చెప్పాడు.