
తూప్రాన్, వెలుగు : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి పోతురాజుపల్లిలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల స్కూల్ లో చదువుతున్న ఓ స్టూడెంట్ జాండీస్‌తో కన్నుమూసింది.పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్‌కు చెందిన సౌజన్య జ్యోతిబా పూలే గురుకుల స్కూల్ లో 8వ తరగతి చదువుతోంది. 21వ తేదీన ఆమెకు జ్వరంతో పాటు వాంతులయ్యాయి. దీంతో ట్యాబ్లెట్స్ ఇచ్చారు. తెల్లారే ఉగాది ఉండడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. 23వ తేదీన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వచ్చి తీసుకెళ్లారు. తర్వాత సౌజన్యను హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించినా తగ్గలేదు.
జాండీస్‌తో లివర్ దెబ్బతినడంతో ఆరోగ్యం విషమించి ఆదివారం చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు స్కూల్ కు వచ్చి ప్రిన్సిపాల్, టీచర్లతో గొడవకు దిగారు. నిర్లక్ష్యంతో తమకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడం వల్లే సౌజన్య చనిపోయిందని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారికి నచ్చచెప్పారు. అయితే, విద్యార్థిని వైద్యానికి అయిన ఖర్చులు భరిస్తామని టీచర్లు హామీ ఇచ్చినట్టు తెలిసింది.