లాటరీతోనే హెచ్ 1బీ వీసాలు

లాటరీతోనే హెచ్ 1బీ వీసాలు
  • డిసెంబర్ 31 దాకా పాత పద్ధతినే కొనసాగిస్తం- అమెరికా ప్రెసిడెంట్ బైడెన్
  • ట్రంప్ తెచ్చిన కొత్త రూల్స్ అమలు వాయిదా
  • కొత్త రూల్స్ అమలుకు ఏర్పాట్ల కోసమే లాటరీ సిస్టం కొనసాగింపు

వాషింగ్టన్: ఇండియాతో సహా వివిధ దేశాల ఎంప్లాయీస్ అమెరికాలో పని చేసేందుకు ఇచ్చే హెచ్ 1బీ వర్క్ వీసాలపై పాత లాటరీ విధానాన్నే కొనసాగిస్తామని అమెరికా  సర్కార్ ప్రకటించింది. హెచ్ 1బీ వీసాల ప్రాసెస్ ను కఠినతరం చేస్తూ ఇంతకుముందు ప్రెసిడెంట్ ట్రంప్ కొత్త రూల్స్ ను తీసుకురాగా, వాటి అమలును కొత్త ప్రభుత్వం వాయిదా వేసింది. లాటరీ సిస్టంను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ కొనసాగించాలని నిర్ణయించింది. హెచ్ 1బీ వీసాలకు లాటరీ సిస్టంను నిలిపేస్తామని, కొత్త రూల్స్ ను అమలు చేస్తామని యూఎస్ సిటిజన్​షిప్​ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్)జనవరి 7న ప్రకటించింది. అయితే హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పులు చేసి, వాటిని టెస్ట్ చేసి, అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం  యూఎస్ సీఐఎస్ కి వెసులుబాటును కల్పిస్తూ లాటరీ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

ఏమిటీ హెచ్ 1బీ?

అమెరికన్ కంపెనీలు విదేశాల నుంచి టెక్నికల్ ఎక్స్ పర్టైజ్ ఉన్న ఉద్యోగులను నియమించుకునేందుకు ఇచ్చే నాన్ ఇమిగ్రెంట్ వీసాలే హెచ్ 1బీ వీసాలు. ఏటా ఇండియా, చైనా తదితర దేశాల నుంచి 65 వేల మంది ఎంప్లాయీస్ ను అమెరికన్ కంపెనీలు ఈ వీసాలపై రిక్రూట్ చేసుకుంటుంటాయి.

ట్రంప్ పెట్టిన రూల్స్ ఇవీ..

అమెరికన్ వర్కర్లకు ఉద్యోగాలు దొరకడంలేదని ట్రంప్ హెచ్​1 బీ వీసాలకు కొత్త రూల్స్ తెచ్చారు. విదేశాల నుంచి హైలీ స్కిల్డ్ వర్కర్లనే తీసుకోవాలని, మినిమం శాలరీ అమెరికన్ ల కన్నా ఎక్కువగా ఉండాలని పేర్కొన్నారు. వీసాలకు లాటరీ సిస్టంను కూడా రద్దు చేశారు. అయితే ఈ కొత్త రూల్స్ అమలును ప్రెసిడెంట్​జో బైడెన్ ఈ ఏడాది లాస్ట్ వరకూ వాయిదా వేశారు.

ఫారిన్ రిలేషన్స్ ను రిపేర్ చేస్తాం: బైడెన్ 

ట్రంప్ హయాంలో వివిధ దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను తన ప్రభుత్వం రిపేర్ చేస్తుందని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. తొలిసారిగా ఫారిన్ పాలసీపై ఆయన గురువారం మేజర్ స్పీచ్ ఇచ్చారు. ‘‘మా మిత్రదేశాలు, పార్టనర్ కంట్రీస్ తో కలిసి పనిచేస్తాం. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ను తిరిగి యాక్టివ్ చేస్తాం. మా క్రెడిబిలిటీ, మోరల్ అథారిటీని తిరిగి సాధించుకుంటాం” అని తెలిపారు. ‘‘ప్రపంచం నేడు ఒక మాట వినాలని కోరుతున్నా. అమెరికా ఈజ్ బ్యాక్. యూఎస్ కు పోటీగా చైనా ఎదగాలనుకుంటోంది. మా డెమోక్రసీని ధ్వంసం చేయాలని రష్యా చూస్తోంది. ఇలాంటి సవాళ్లన్నింటినీ ఎదుర్కొనేందుకు మేం సిద్ధమయ్యాం”అని ప్రెసిడెంట్ జో బైడెన్ వివరించారు.

For More News..

18 నెలల తర్వాత కాశ్మీర్​లో 4జీ

టెన్త్​ పాసైతే​ చాలు​.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

ఐపీఎల్‌ ఆక్షన్‌కు 1097 మంది ప్లేయర్లు