బంగారానికి హాల్ మార్కింగ్ ఉండాల్సిందే

బంగారానికి హాల్ మార్కింగ్ ఉండాల్సిందే

మనం కొనే ప్రతీ వస్తువులో నాణ్యత ఉండాలనుకుంటాం. ఎక్కువ విలువైన వస్తువులైతే చెప్పనే అక్కర్లేదు…కచ్చితంగా క్వాలిటీ చూస్తాం ..ఆ వస్తువు బంగారం అయితే మరింత ఎక్కువ పారదర్శకత కోరుకుంటాం. బంగారం మన జీవితంలో ఎంతో విలువైంది కాబట్టి, నాణ్యత విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నమ్మకమైన వారి దగ్గరే తీసుకుంటాం. బంగారు ఆభరణాల్లో పారదర్శకత కోసం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నాణ్యతను పరిశీలించి బీఐఎస్ లోగోతో హాల్‌ మార్కింగ్ చేస్తోంది. ప్రస్తుతానికి 14,18,22 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో హాల్‌ మార్కింగ్ ఉండగా, మిగిలిన 20,23,24 క్యారెట్లకూ హాల్‌ మార్కింగ్ ఉండాలని బంగారం వ్యాపారులు కోరుతున్నారు. అంతేకాదు, ప్రమాణం అనేది ఒకే విధంగా ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు.

బంగారానికి ప్రామాణికం అవసరం. ఇప్పటివరకు 14,18,22 క్యారెట్ల బంగారంలోనే హాల్‌ మార్కింగ్ ఉంది. దీంతో పాటు 20,23,24 క్యారెట్లబంగారంలో కూడా హాల్‌ మార్కింగ్ ఉండాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) కోరుతోంది. ఇండియాలో నగలు ఎక్కువగా 22 క్యారెట్ల రూపంలోనే తయారవుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇతర క్యారెట్లలో కూడా బంగారు ఆభరణాలను తయారు చేస్తున్నారు.దీంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతులు చేసేటప్పుడు కూడా ఈ హాల్‌ మార్కింగ్ తప్పనిసరి అవుతోంది. కస్టమర్లు కొనుగోలు చేసిన తమ బంగారానికి కచ్ఛితమైన నాణ్యతను తెలియజేసేందుకు, పారదర్శకత కోసం అన్నింట్లో హాల్‌ మార్కింగ్ ఉండాల్సిందే.

హాల్‌ మార్కింగ్ అంటే

ఆభరణంలో బంగారం నాణ్యతను తెలియజెప్పేదే హాల్‌ మార్కింగ్. ఏదైనా బంగారు ఆభరణం తయారు చేయాలంటే ప్యూర్ గోల్డ్‌ తో చేయడం సాధ్యం కాదు. దాన్లో కచ్చితంగా ఇతర లోహాలను కలపాల్సిం దే. ప్యూర్ బంగారం చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి రాగి వంటి ఇతర లోహాలు కలపకుండా నగలను తయారు చేయడం సాధ్యపడదు. ఆభరణం తయారీ పూర్తైన తరువాత అందులోబంగారం శాతం ఎంత, కలిపిన ఇతర లోహాల శాతం ఎంత అని తెలుసుకోవడానికి హాల్‌ మార్కింగ్ అవసరం. 916 పేరు వినే ఉంటాం. హాల్‌ మార్కింగ్‌‌‌‌లో 916 అంటే వంద గ్రాముల బంగారు నగలలో ప్యూర్ గోల్డ్ 91.6 శాతం ఉన్నట్లు. అంటే బంగారు నగలలో ప్యూర్ గోల్డ్ ఎంత ఉందనేది హాల్‌ మార్కింగ్‌‌‌‌తో తెలుసుకోవచ్చు. నగలలో ఇతరలోహాల శాతం ఎక్కువ కూడా ఉండే అవకాశాలుంటాయి కాబట్టి కొనే నగలలో హాల్‌ మార్కింగ్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

అన్నింట్లో హాల్‌ మార్కింగ్ ఉండాలి

దేశవ్యాప్తంగా తయారయ్యే నగలలో 90 శాతం 22 క్యారెట్ల బంగారాన్నే వాడుతుండగా, మిగిలిన10 శాతం ఇతర క్యారెట్ల బంగారంతో తయారుచేస్తున్నారు. డైమండ్ నగలలో ఎక్కువగా 21క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారు. కానీ 21క్యారెట్ల బంగారానికి హాల్‌ మార్కింగ్‌‌‌‌ లేదు. డైమండ్ నాణ్యతకు హామీ ఇస్తున్నట్లే, డైమండ్ నగల తయారీలో వాడే 21 క్యారెట్ల బంగారానికి కూడా హాల్‌ మార్కింగ్ ఉంటే కస్టమర్లకు మరింత నమ్మకం ఉంటుంది. ఇక 23 క్యారెట్ల బంగారాన్ని రాజస్థాన్‌ లో ఎక్కువగా వాడతారు. 20 క్యారెట్ల బంగారాన్ని ఇండియాలో దాదాపుగా వాడరు.

బంగారు బిస్కెట్లలో కూడా ఇన్నేళ్లు స్విస్‌ నుండి బంగారు బార్లు దిగుమతి అయ్యేవి. వాటిపై నాణ్యతను తెలియపరుస్తూ స్విస్ లోగో ముద్రించేది. ఇప్పుడు బాంబేతో పాటు ఇతర నగరాల్లో కూడా బంగారం బార్లు, బిస్కెట్లు,కాయిన్ల తయారీ జరుగుతోంది. వీటి నాణ్యత తెలుసుకోవడం కష్టం . అందుకే వీటికీ హాల్‌ మార్కింగ్ ఉండాలని వ్యాపారులు కోరుతున్నారు. దీంతోకస్టమర్లకు పూర్తి భరోసా ఉంటుంది. బంగారంలో హాల్‌ మార్కింగ్ కంపల్సరీ అని, అన్ని రకాల్లో హాల్‌ మార్కింగ్ ఉంటే పారదర్శకత పెరగడంతోపాటు మోసాలను అరికట్టవచ్చని కుందన్ జ్యువెల్లర్స్ యజమాని సతీష్ తెలిపారు.

సర్టిఫైడ్ బంగారం అయితే కస్టమర్లకునమ్మకం పెరుగుతుంది. ఇండియాలోఎక్కు వగా వాడేది 22 క్యారెట్ల బంగారమేఅయినప్పటికీ అన్నింట్లో హాల్‌‌‌‌మా ర్కింగ్ఉంటే, కొనే ప్రతీ నగపై విశ్వాసంఉంటుంది. ఎందుకంటే ఒక్కోప్రాంతంలో ఒక్కో నగకు ఒక్కో రకంబంగారాన్ని వాడతారు. డైమండ్నగలలో 21 క్యారెట్ల బంగారాన్నివాడుతుండగా, రాజస్థా న్‌ లో నగలకు 23క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తా రు.కాబట్టి ప్రతీ వాటికి హాల్‌‌‌‌మా ర్కింగ్ ఉంటేవాటి నాణ్యతను సులువుగా తెలసుకునేఅవకాశం ఉంటుంది. బంగారు బిస్కెట్లులోకల్‌‌‌‌గా తయారవుతున్నా యి కాబట్టివాటికి కూడా హాల్‌‌‌‌మా ర్కింగ్ చేయాలి. — గోపీకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ ,మానేపల్లి జ్యువెల్లర్స్ .

పసిడి దిగుమతులు తగ్గాయి.

2018–19 లో బంగారం దిగమతులు3 శాతం తగ్గాయి. విలువపరంగా 32.8బిలియన్‌ డాలర్లకు దిగివచ్చాయి. 2017–18లో 33.7 బిలియన్‌ డాలర్ల విలువైనబంగారం దిగుమతవగా, గత ఏడాది దిగు-మతులు 3 శాతం తగ్గి 32.8 బిలియన్‌ డాల-ర్లుగా నమోదయ్యాయి. అంతర్జా తీయంగాబంగారం ధరలు తగ్గుముఖం పట్టడం,దిగుమతుల విలువ తగ్గడానికి కారణమనిభావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధి కంగాబంగారం దిగుమతి చేసుకునే దేశాల్లోఇండియా ఒకటి. ప్రధానంగా జ్యువెల్లరీ పరి-శ్రమ నుం డే ఎక్కువ డిమాం డ్ ఉంటుం ది.పసిడి దిగుమతులను నిలువరించడానికిప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుం ది.బంగారం దిగుమతులపై 10 శాతం పన్నువిధించిం ది. ఎగుమతులు మరింత పెరిగేం-దుకు, దిగుమతిపై పన్నును తగ్గిం చడం-తో పాటు, దిగుమతులను సులభతరంచేయాలని పరిశ్రమ కోరుతోంది.