సామాజిక దూరం తప్ప మరో మార్గం లేదు: హార్వర్డ్

 సామాజిక దూరం తప్ప మరో మార్గం లేదు: హార్వర్డ్

ప్రపంచదేశాలలో లాక్‌డౌన్‌ విధిస్తున్నప్పటికి కూడా కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారిని అరికట్టే మెడిసిన్ ను కనిపెట్టేందుకు చాలా దేశాలకు చెందిన సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే హార్వర్డ్‌  సైంటిస్టులు కరోనాకు సంబంధించి అనేక విషయాలు తెలిపారు. 2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే ఈ వైరస్ నుంచి విముక్తి పొందవచ్చని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలకు పైగానే ఉన్నాయన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నప్పటికి కూడా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయని తెలిపారు. కరోనా ప్రభావం మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలో చాలా మందికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందన్నారు. రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు మాత్రమే దీని భారి నుండి కోలుకుంటున్నారన్నారు. వ్యాక్సిన్‌ కనుక్కోలేక పోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని సూచించారు. ప్రస్తుతం కరోనా నివారణకు సామాజిక దూరం తప్ప మరే మార్గము లేదని స్పష్టం చేశారు హార్వర్డ్ సైంటిస్టులు.