33ఆస్పత్రుల్లో 80శాతం ఐసీయూ బెడ్లు కరోనా పేషెంట్లకే

33ఆస్పత్రుల్లో 80శాతం ఐసీయూ బెడ్లు కరోనా పేషెంట్లకే

33 ఆస్పత్రులలో 88శాతం ఐసీయూ బెడ్లు కరోనా పేషెంట్లకు ఇచ్చేందుకు హైకోర్ట్ అనుమతిచ్చింది. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క రోజే 8వేలకు పైగా కరోనా కేసులు కాగా..మొత్తం కేసులు 4.59లక్షల మందికి సోకింది. వైరస్ బారిన పడి 7,228 మంది మరణించారు. దీంతో బాధితుల కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..33 ఆస్పత్రులలో ఉన్న 88శాతం ఐసీయూ బెడ్లు రోగులకు కేటాయించాలని నిర్ణయంచారు. అయితే ప్రభుత్వ నిర్ణయం పై ఢిల్లీ హైకోర్ట్  సింగిల్ జడ్జి స్టే విధించారు. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్ట్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. తదిపరి విచారణను నవంబర్ 26కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్ట్.  కాగా ఇటీవల 300 ఐసీయూ పడకలతో సహా కేంద్ర ప్రభుత్వ పాలిత ఆసుపత్రులలో 1,092 పడకలను పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నవంబర్ 7 న కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్‌కు లేఖ రాశారు.