పెరిగిన హెచ్​సీఎల్​ లాభం

పెరిగిన హెచ్​సీఎల్​ లాభం
  •     10 శాతం గ్రోత్​తో రూ. 3,832 కోట్లు
  •     రెవెన్యూ రూ. 26,672 కోట్లు
  •     ఇంటెరిమ్​ డివిడెండ్​ షేర్​కు రూ. 12

హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ లాభం సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో 10 శాతం పెరిగి రూ. 3,832 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో కంపెనీకి రూ. 3,489 కోట్ల లాభం వచ్చింది. రెవెన్యూ తాజా సెప్టెంబర్​ క్వార్టర్లో 8 శాతం ఎక్కువై రూ. 26,672 కోట్లయింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఒక్కో ఈక్విటీ షేర్​కు రూ. 12 చొప్పున ఇంటెరిమ్​ డివిడెండ్​ను రికమెండ్​ చేసింది. కంపెనీ ప్రకటించిన లాభం, రెవెన్యూలు ఎనలిస్టుల అంచనాలను మించాయి. 

హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ ఇబిటా అంతకు ముందు ఏడాది క్యూ2 తో పోలిస్తే తాజా క్యూ2 లో  11 శాతం పెరిగి రూ. 4,934 కోట్లకు చేరింది. రెండో క్వార్టర్లో హెచ్​సీఎల్​ టెక్​ 16 పెద్ద డీల్స్​ను దక్కించుకుంది. ఇందులో 10 సర్వీసెస్​ డీల్స్​ కాగా, మిగిలిన 6 సాఫ్ట్​వేర్​ డీల్స్​గా కంపెనీ వెల్లడించింది. సెప్టెంబర్​ క్వార్టర్లో వచ్చిన డీల్స్​ విలువ 3.9 బిలియన్​ డాలర్లని తెలిపింది. 2023–24 లో రెవెన్యూ గ్రోత్​ 4 నుంచి 5 శాతం దాకా ఉండొచ్చని హెచ్​సీఎల్​ టెక్​  గైడెన్స్​ను ఇచ్చింది. 

పూర్తి ఏడాదికి ఇబిటా మార్జిన్​ 18 నుంచి 19 శాతం దాకా ఉండే ఛాన్స్​ ఉందని పేర్కొంది. సెప్టెంబర్​ క్వార్టర్లో 4 బిలియన్​ డాలర్ల డీల్స్​ దక్కించుకోవడంతో మీడియం టర్మ్​లో  పెర్​ఫార్మెన్స్​పై ఆశాభావం పెరిగిందని హెచ్​సీఎల్​ టెక్​ సీఈఓ సీ విజయ్ ​కుమార్​ చెప్పారు. సెప్టెంబర్​ క్వార్టర్​ చివరి నాటికి మొత్తం 2,21,139 ఉద్యోగులు కంపెనీలో పనిచేస్తున్నారు. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్​తో పోలిస్తే ఉద్యోగుల వలస భారీగా తగ్గింది.