HDFC కస్టమర్స్ అలర్ట్: మే 25న ఆ టైంలో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ బంద్

HDFC కస్టమర్స్ అలర్ట్:  మే 25న ఆ టైంలో  నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్  బంద్

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్  కస్టమర్లకు ముఖ్య గమనిక. మే 25న కాసేపు  నెట్ బ్యాంకింగ్,మొబైల్ బ్యాంకింగ్, UPI  వంటి ఆన్ లైన్లు సేవలు నిలిపివేస్తున్నట్లు హెచ్ డీఎఫ్ సీ  ప్రకటించింది. మే 25న ఉదయం 3.30 నుంచి6.30 గంటల వరకు  హెచ్ డీఎఫ్ సీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ లు, డిపాజిట్లు, అకౌంట్లు, ఫండ్ ట్రాన్స్ ఫర్లు  అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ కస్టమర్లకు మెసేజ్ ద్వారా ఈ సమాచారం అందిస్తోంది. 

 బ్యాంక్ వెబ్‌సైట్‌లోని నోటీసు ప్రకారంషెడ్యూల్డ్ మెయింటెనెన్స్ ప్రకారం.. HDFC బ్యాంక్ నెట్‌బ్యాంకింగ్ & మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో కొన్ని లావాదేవీలు మే 25న  ఉదయం 3:30 గంటల నుంచి 6:30  మధ్యన అందుబాటులో  ఉండవు.  ఖాతాలు, డిపాజిట్లు, నిధుల బదిలీలు (NEFT, IMPS, RTGS & బ్యాంక్ బదిలీల లోపల), ఆన్‌లైన్ చెల్లింపు,  ఇతర లావాదేవీలు కూడా జరపలేరని తెలిపింది.

చాట్ బ్యాంకింగ్..

 మరింత సమాచారం కోసం హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్లు చాట్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. HDFC బ్యాంక్ చాట్‌ బ్యాంకింగ్ సేవ అంటే  వాట్సాప్‌  సేవలు . అయితే ఈ ఆఫర్ బ్యాంక్‌లో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా  మీ బ్యాంక్ రిజిస్టర్ నెంబర్ నుంచి 7070022222 నంబర్‌ కు హాయ్ అని సెండ్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చుజ