ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు బుధవారం నుండి వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. అన్ని టెనార్లలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్) 0.35 శాతం (35 బేసిస్ పాయింట్లు) పెంచింది. ఎంసీఎల్ఆర్ రేట్ల పెంపుతో, హోం, ఆటో, పర్సనల్సహా వివిధ రకాల లోన్ల ఈఎంఐలు పెరుగుతాయి. పోయిన నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లెండింగ్ రేటును పెంచడం ఇది రెండోసారి. కిందటి నెల కూడా రేట్లను పెంచింది.
