100 కోట్ల​ డాలర్ల లోన్ తీసుకోనున్న హెచ్​డీఎఫ్​సీ

100 కోట్ల​ డాలర్ల లోన్ తీసుకోనున్న హెచ్​డీఎఫ్​సీ

న్యూఢిల్లీ: విదేశీ లోన్ల (ఈసీబీ) ద్వారా బిలియన్​ డాలర్ల విలువైన (రూ.8,200 కోట్లు) బాకీ​ తీసుకోవడానికి హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోన్​ గడువు 1–5 ఐదేళ్ల మధ్య ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో లోన్లకు భారీగా డిమాండ్​ పెరుగుతుందన్న అంచనాలతో ఇంత భారీ మొత్తాన్ని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అప్పు తీసుకుంటోందని పేర్కొన్నాయి. ఇండియా బ్యాంకులు విదేశీ బ్యాంకుల నుంచి తీసుకునే మొత్తాన్ని ఆర్​బీఐ 1.5 బిలియన్​ డాలర్లకు పెంచింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​తోపాటు హెచ్​డీఎఫ్​సీ విలీనానికి బీఎస్​ఈ, ఎన్​ఈలు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ బ్యాంకు ఈసీబీ కోసం ప్రయత్నాలను మొదలుపెట్టింది. కొత్త సంస్థ అసెట్​బేస్​ విలువ రూ.18 లక్షల కోట్లు ఉంటుంది. 2024 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో క్వార్టర్​నాటికి విలీనం పూర్తవుతుంది. విలీనానికి రెగ్యులేటరీ అప్రూవల్స్​ అవసరమని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. 

కొత్తగా 100 శాఖలు ప్రారంభం 

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంకు భారతదేశ వ్యాప్తంగా 100 కొత్త శాఖలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇవి 15 రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలలోని 83 నగరాలు/పట్టణాలలో మొదలయ్యాయి. వీటిలో సగం వరకు చిన్న నగరాలు,  గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.  కొత్త శాఖలను బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్  శశిధర్ జగదీశన్ డిజిటల్ విధానంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సీనియర్​ బ్యాంకు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయమై హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ  బ్యాంకు రిటెయిల్ బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూపు హెడ్ అరవింద్ వోహ్రా మాట్లాడుతూ, ‘‘మా వినియోగదారులకు సాధారణ బ్యాంక్​ బ్రాంచులతోపాటు డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా కూడా సమర్థంగా సేవలు అందిస్తాం. రాబోయే నెలలలో మరిన్ని ఎక్కువ శాఖలను ప్రారంభిస్తాం. నాణ్యతతో కూడిన బ్యాంకింగ్ ఉత్పత్తులను,  సేవలను దేశ వ్యాప్తంగా లభించేలా చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.