ఒక్క ఆర్ట్‌‌‌‌‌‌‌‌తో లక్షలమంది ఫాలోవర్లను పెంచుకున్నాడు

ఒక్క ఆర్ట్‌‌‌‌‌‌‌‌తో లక్షలమంది ఫాలోవర్లను పెంచుకున్నాడు

అదొక డిజిటల్ ఆర్ట్. ‘ఇన్ఫినిటీ ఆర్ట్’  దాని పేరు. పేరుకి తగ్గట్టుగానే ఈ ఆర్ట్‌‌‌‌‌‌‌‌ను జూమ్ చేసేకొద్దీ కొత్తకొత్త కథలు కనిపిస్తాయి. మామూలుగా ఫొటోను జూమ్ చేసే కొద్దీ క్వాలిటీ తగ్గి బ్లర్ అయినట్టు కనిపిస్తుంది. కానీ వస్కాంజే రూపొందించిన ఈ ఆర్ట్ మాత్రం అలా కాదు. ఒక ఆర్ట్ నుంచి మరొకటి.  దాన్నుంచి మరొకటి. అలా జూమ్ చేసే కొద్దీ కొత్త ఆర్ట్‌‌‌‌‌‌‌‌లు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఆర్ట్‌‌‌‌‌‌‌‌ను రూపొందించిన లుకాస్ వస్కాంజే  పర్షియన్ ఆర్టిస్ట్. ఈ ఒక్క ఆర్ట్‌‌‌‌‌‌‌‌తో తను లక్షలమంది ఫాలోవర్లను పెంచుకున్నాడు. ఈ ఆర్ట్‌‌‌‌‌‌‌‌ను ఒక వీడియో రూపంలో ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల్లోనే ఇది లక్షల్లో వ్యూస్ తెచ్చుకుని నెట్టింట వైరల్ అయింది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి వేళ్లతో ఫోన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డిజిటల్ ఆర్ట్‌‌‌‌‌‌‌‌ను జూమ్ చేస్తూ ఉంటాడు. మొట్టమొదటి ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌లో ఒక ఆర్టిస్ట్ బొమ్మ గీస్తున్నట్టు ఉంటుంది.  దాన్ని జూమ్ చేయగానే  గోడపై ఒక చిన్న ఫొటోలో పాప కిటికీ పక్కన కూర్చొని ఉంటుంది. ఆ కిటికీని జూమ్ చేస్తే.. ఒక ట్రైన్ కనిపిస్తుంది. అలా జూమ్ చేసుకుంటూ పోతే.. ట్రైన్ లో కూర్చున్న వ్యక్తి , ఆ వ్యక్తి టేబుల్ మీద ఉన్న కెమెరా, కెమెరా లెన్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫొటో. ఇలా ఒక్క ఆర్ట్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో కథలను అమర్చాడు ఆర్టిస్ట్ వస్కాంజే. అయితే ఈ డిజిటల్ ఆర్ట్‌‌‌‌‌‌‌‌ను చూసిన ప్రతి ఒక్కరికీ ఒక డౌట్ వస్తుంది. అంత జూమ్ చేసినా  క్వాలిటీ ఎందుకు తగ్గట్లేదని. అయితే పిక్సెల్స్‌‌‌‌‌‌‌‌తో  కాకుండా వెక్టార్స్‌‌‌‌‌‌‌‌తో ఎంతో కష్టపడి ఈ ఆర్ట్‌‌‌‌‌‌‌‌ రూపొందించడం వల్ల ఇది సాధ్యమైందని ఆర్టిస్ట్ చెప్పాడు. లుకాస్‌‌ వస్కాంజేకు ఇలాంటి ఆర్ట్‌‌లు కొత్తేమీ కాదు. డిజిటల్ ఆర్ట్‌‌లో లుకాస్‌‌కు మంచి పేరుంది. గతంలో కూడా కొన్ని అద్భుతమైన డిజిటల్ ఇలస్ట్రేషన్లు క్రియేట్ చేశాడు.  కానీ  వెక్టా్ర్ ఇమేజ్‌‌లో ఇలా ఏడెనిమిది లేయర్లు తయారుచేయడం, ప్రతీ లేయర్‌‌‌‌ని స్పష్టంగా చిత్రీకరించడం..  డిజిటల్ ఆర్ట్‌‌లో ఇదే మొదటిసారి.