Health Tips: తలనొప్పి భరించలేకపోతున్నారా.. ఇలా చేయండి​.. ఇట్టే తగ్గిపోతుంది

Health Tips:  తలనొప్పి భరించలేకపోతున్నారా.. ఇలా చేయండి​.. ఇట్టే తగ్గిపోతుంది

అబ్బ... తలనొప్పిగా ఉంది.. భరించలేకపోతున్నా...కాస్త సైలంట్​ గా ఉండండి.. అనే మాటలు తరచూ ప్రతి ఇంట్లో సాధారణంగా వినపడుతాయి.  రోజువారి పనులతో చికాకు, తలనొప్పి రావడం కామనే.  తలనొప్పి వచ్చినప్పుడు రిలీఫ్​ పొందేందుకు తీసుకోవలసిన చిట్కాల గురించి తెలుసుకుందాం. . .

  • తలనొప్పికి మన భావోద్వేగాలతో సంబంధం ఉంది. అందుకే.. తలనొప్పి మొదలవగానే.. ఆలోచించడం మానేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి. 
  • శరీరానికి సరిపడా నీళ్లు అందకపోయినా.. తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పికి ఒక గ్లాసు చల్లటి నీళ్లు తాగండి
  • ఐస్​ ముక్కలను  గుడ్డలో చుట్టి తలచుట్టూ ఆడిస్తే.. క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది.
  •  గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కున్నా రిలీఫ్​ ఉంటుంది
  • మాడు, కణతల మీద మృదువుగా మర్దన చేసినా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
  • చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకొండి... తలనొప్పి మటుమాయం అవుతుంది.