Good Food : చింత చిగురు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. నొప్పులు, వాపులు తగ్గుతాయి..!

Good Food : చింత చిగురు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. నొప్పులు, వాపులు తగ్గుతాయి..!

చింతపండు కంటే చింత చిగురు తింటేనే ఎక్కువ ప్రయోజనాలున్నాయి.. చింత చిగురును ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరానికి డైటరీ ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్ పని చేస్తుంది. చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఈ చిగురు ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండడమే ఇందుకు కారణం. 

కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తరచు చింత చిగురుతింటే ఎముకలు గట్టి పడతాయి. 

థైరాయిడ్ తో బాధపడేవారు చింత చిగురు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులకు కూడా చింత చిగురు మంచి ఔషధమట..శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింత చిగురును పేస్ట్ లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.