ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది

ఢిల్లీ హాస్పిటళ్లలో ఆక్సిజన్ పై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్. ఒక్కో హాస్పిటల్ లో పరిస్థితి ఒక్కో విధంగా ఉందన్నారు. కొన్ని6 గంటల, మరికొన్నింటిలో 8, 10 గంటల వరకు సరిపడే ఆక్సిజన్ మాత్రమే ఉందన్నారు. ఇలాంటి టైంలో పరిస్థితి బాగానే ఉందని ఎలా చెప్తాం అన్నారు.ఢిల్లీలో 3 రోజులుగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు పెంచిందన్నారు. ఐతే అవసరమైన దానికంటే కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. బెడ్లు పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు సత్యేంద్ర జైన్. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో బెడ్లతో పాటు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు 80 శాతం బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. 

గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందన్నారు సీఎం కేజ్రీవాల్. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆక్సిజన్ కోటా కేటాయించిందని చెప్పారు. ఢిల్లీకి ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు. గతంలో 378 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించిన కేంద్రం తాజాగా దాన్ని 480 టన్నులకు పెంచిందన్నారు. ఐతే ఇది ప్రస్తుత అవసరాలకు ఏ మాత్రం సరిపోదన్నారు. ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు కేంద్రం సంస్థలను కూడా కేటాయించిందని చెప్పారు కేజ్రీవాల్. ఐతే కొన్ని రాష్ట్రాలు ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ను నిలిపివేశాయన్నారు.