పిల్లల ఆకలి తీరిస్తే సరిపోదు..!

పిల్లల ఆకలి తీరిస్తే సరిపోదు..!

పిల్లలకు న్యూట్రిషన్​ ఫుడ్​ ఇవ్వకపోతే శారీరక, మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎదుగుదల కూడా ఉండదు. పరిస్థితులను అర్థం చేసుకొనే కెపాసిటీ ఉండదు. ఇమ్యూనిటీ తగ్గుతుంది. ‘పిల్లల ఆకలి తీరిస్తే సరిపోదు, పోషక విలువలతో కూడిన మెనూ అందించాలి’ అని అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.

ఉదయాన్నే పిల్లలను లేపాలి. స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాలి. ఇంటికొచ్చాక ట్యూషన్​​ చెప్పించాలి. చాలామంది పేరెంట్స్​ ఆలోచనలు ఇలానే ఉంటున్నాయి. దాంతో పిల్లలు చదువు ధ్యాసలో పడి సరైన తిండి తినడం లేదు. బర్గర్లు, పిజ్జాలు, చిప్స్​ తింటూ లంచ్​ను ‘మమ’ అనిపిస్తున్నారు. కొందరు పేరెంట్స్​ లంచ్​ బాక్సు​ల్లో ప్రాసెస్డ్​ ఫుడ్​ పెడుతున్నారని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇది హెల్దీ కాదు, అందుకే పిల్లలకు ఎలాంటి ఫుడ్​ ఇవ్వాలి? ఏ టైమ్​లో ఇవ్వాలి? ఇలాంటి విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

మార్కులు, ర్యాంకులు, పర్సంటేజీలు.. పేరెంట్స్​ వీటికే ప్రయారిటీ ఇస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ చూపడం లేదు. లేస్తూనే బడికి, వస్తూనే ట్యూషన్​కు వెళ్లే పిల్లలు ఎక్కువే. ‘చదువుపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై కూడా చూపాలి’ అంటున్నారు ఎక్స్​పర్ట్స్. చదువులు, పరీక్షలు అంటు సాకుగా చూపి, ఫాస్ట్​ ఫుడ్​ తిని అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. పిల్లలకు చదువుతోపాటు సరైనవి తినడమూ అవసరమే.

సరైన దినచర్య

చిన్న చిన్న అలవాట్లు హెల్దీగా ఉంచుతాయి. చాలామంది డైలీ లైఫ్​ను తేలిగ్గా తీసుకుంటారు. అంటే సమయానికి నిద్రపోవడం, సమయానికి తినడం అవసరం. చదువుల కారణంగా పిల్లలు ఒక్కోసారి లంచ్​ స్కిప్​ చేస్తుంటారు. ఎందుకని అడిగితే.. ‘ఏమాత్రం పర్సంటేజ్​ తగ్గినా అమ్మానాన్న ఊరుకోర’ని చెప్తున్నారు. అందుకే పేరెంట్స్​ పిల్లలను సరైన దినచర్య పాటించేలా ఎంకరేజ్​ చేయాలి. సక్రమమైన ఆహారపు అలవాట్లు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోతే బలహీనంగా తయారవుతారు.

న్యూట్రిషన్​ ఇవ్వాలి

చిన్న వయసులో న్యూట్రిషన్​ ఫుడ్​ ఇవ్వకపోతే శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. ఎదుగుదల కూడా ఉండదు. పరిస్థితులను అర్థం చేసుకొనే కెపాసిటీ ఉండదు. రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్​) తగ్గుతుంది. ‘విటమిన్, ఐరన్, క్యాల్షియం, అయోడిన్’ లాంటివి అందవు. దాంతో రోగ నిరోధకశక్తిపై ప్రభావం పడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే ఇబ్బందులు పడుతారు. ఫలితంగా చదువుపై ప్రభావం పడుతుంది. అనారోగ్యం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతారు. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్​ వీలైనంత వరకు తగ్గించాలి. ఒకే రకమైన ఆహారం ఇవ్వడం వల్ల కూడా సరిగా తినరు. లంచ్​ బాక్స్​లో పోషకాలు ఉండేలా మెనూ రెడీ చేయాలి.

కొంచెం తగ్గించాలి

కొందరు పిల్లలు చిప్స్​​, బిస్కెట్లు లాంటివి తింటుంటారు. దాని వల్ల బరువు పెరుగుతారు. వీలైనంత వరకు చిరుతిళ్లకు దూరంగా ఉండేలా పేరెంట్స్​ జాగ్రత్తలు తీసుకోవాలి. మరికొంతమంది పిల్లలు స్వీట్స్​, చాక్లెట్స్​ తినడానికి ఇష్టం చూపుతారు. అదేపనిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో కొవ్వుశాతం పెరిగి బరువుకు దారితీస్తుంది. గుడ్డు, మొలకలు, చిరుధాన్యాలను ఇవ్వాలి. ఇంకొంతమంది పిల్లలు ఒకే రకమైన ఫుడ్​ ఎక్కువగా తీసుకుంటారు. అలాంటివి కొంచెం తగ్గించాలి.

ఎదుగుదల కోసం..

పిల్లల్లో శారీరక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లల పెరుగుదల కోసం కూడా సరైన ఫుడ్​ ఇవ్వాలి. లేదంటే ఎదుగుదల అంతగా ఉండదు. చాలామంది పిల్లలకు సరైన ఆహారం అందక ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి డాక్టర్లను సంప్రదించి, పెరుగుదల కోసం ఏయే ఆహారం ఇవ్వాలో తెలుసుకోవాలి.

ఎక్సర్​సైజ్​ కూడా..

పిల్లలు చదువులో ముందుండాలనే ఆలోచనతో పిల్లల్ని ఆటలకు దూరంగా ఉంచుతారు ఎక్కువమంది పేరెంట్స్. చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమే. ర్యాంకుల ధ్యాసలో పడి చాలా స్కూళ్లు పిల్లలకు ఆటలు ఆడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీంతో వ్యాయామం లేక చురుకుదనం తగ్గుతుంది. కాబట్టి పిల్లలకు ఇష్టమైన ఆటలు ఆడేలా ఎంకరేజ్​ చేయాలి. రన్నింగ్​, జాగింగ్​ లాంటివి అలవాటు చేయాలి. దాని వల్ల మానసిక ప్రశాంతతతోపాటు యాక్టివ్​గానూ ఉంటారు.

చాకెట్లు, చిప్స్ ప్యాకెట్లే ఎక్కువ

చాలామంది పిల్లల స్కూల్​ బ్యాగ్స్​లో​ చాక్లెట్లు, చిప్స్​ ప్యాకెట్లే ఎక్కువగా ఉంటున్నాయి. లంచ్​ టైమ్​లో పిల్లలు అన్నం తినకుండా ఫాస్ట్​ఫుడ్​ తినడానికి ఇష్టం చూపుతున్నారు. ఇరవై నుంచి యాభై రూపాయల వరకు పాకెట్​ మనీ మెయింటెయిన్​ చేస్తున్నారు. ఆ డబ్బులతో కూడా చిప్స్​ ప్యాకెట్లు కొంటున్నారు. చాలామంది పేరెంట్స్​ ఒకే రకమైన లంచ్​బాక్స్​ను ప్రిపేర్​ చేస్తున్నారు. కొందరు ఇడ్లీ, మరికొందరు దోసెలు పెడుతున్నారు. ఒకేరకమైన ఫుడ్​ వల్ల శరీరానికి సరైన విటమిన్స్​ అందవు. సులభంగా జీర్ణమవుతుందని ప్రతిరోజు ఇడ్లీనే పెడుతున్నారు. అది అంత మంచిది కాదు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 – సింధూజ, ప్రైవేట్​ స్కూల్​ టీచర్​, కూకట్​పల్లి.

పోషకాలు కూడా అవసరమే..

చాలామంది పేరెంట్స్​ ఉద్యోగాలు చేస్తుండటంతో పిల్లల డైట్​పై ఫోకస్​ చేయలేకపోతున్నారు. దానికితోడు గారాబం కూడా చేస్తుంటారు. ఇవన్నీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చాలామంది పిల్లలు మ్యాగీ, నూడిల్స్, సమోసాలు, బర్గర్లు తినడానికి ఇష్టం చూపుతారు. దాని వల్ల ఆకలి తీరుతుంది కానీ.. సరైన పోషకాలు అందవు. హెల్త్​ ఇష్యూస్​ కూడా వస్తాయి. బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి వీలైనంత వరకు పేరెంట్స్​ ఇంట్లో తయారు చేసినవే ఇవ్వడానికి ప్రయత్నించాలి. సాంబార్​ ఇడ్లీ, గోధుమ ఉప్మా, మిల్లెట్స్, పాలు, గుడ్డు, సోయా, వెజిటెబల్​ రైస్​ లాంటివి పెట్టాలి. పిల్లలు ఈ రకమైన ఫుడ్​ తినడానికి ఇష్టపడరు. కాబట్టి మొదట్లో నూట్రిషన్​​ ఫుడ్​ పెట్టి తరువాత, ఇష్టమైన ఫుడ్​ ఇవ్వాలి. మెల్లగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే పిల్లలు బలంగా తయారవుతారు.

– డాక్టర్​ సైదా సన, సీనియర్​ డైటీషియన్​, హైదరాబాద్

SEE ALSO:‘నారప్ప’ రచ్చ : మా వాళ్లే రియల్‌‌ హీరోలు..!

తొలి కోటీశ్వరి : దివ్యాంగురాలిని వరించిన అదృష్టం

ప్రధాని మోడీకి ఏరియల్ ఎటాక్ ​ముప్పు!