కురుమూర్తి జాతరలో భక్తుల తిప్పలు

కురుమూర్తి జాతరలో భక్తుల తిప్పలు

చిన్నచింతకుంట, వెలుగు: చిన్నచింతకుంట మండలం అమ్మపూర్  సమీపంలో వెలిసిన కురుమూర్తి స్వామిని దర్శించుకొనేందుకు వస్తున్న భక్తులు భారీ వర్షంతో తిప్పలు పడ్డారు. గుడారాలు వేసుకున్న వ్యాపారులు, జాతరకు వచ్చిన భక్తులు వర్షం, బురదతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. 

వర్షంలో తడుస్తూ గొడుగుల కింద, కవర్లు కప్పుకొని కట్టెల పొయ్యిపై స్వామి వారికి నైవేద్యం తయారు చేయాల్సి వచ్చింది. జాతరకు వచ్చిన వృద్ధులు, చిన్నారులు వర్షానికి తడిసి చలికి వణుకుతూ అవస్థలు పడ్డారు. జాతర ప్రాంగణంలోని రోడ్లు చిత్తడిగా మారడంతో నడవడానికి సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది.