పవన్ ముంజాల్​పై ఎఫ్​ఐఆర్ ​లేదన్న హీరో

పవన్ ముంజాల్​పై ఎఫ్​ఐఆర్ ​లేదన్న హీరో

న్యూఢిల్లీ: తమ​ చైర్మన్​ పవన్​ ముంజాల్​పై ఎఫ్​ఐఆర్​నమోదయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని హీరో మోటోకార్ప్ వివరణ ఇచ్చింది. బ్రెయిన్స్​ లాజిస్టిక్​ ప్రైవేట్​ లిమిటెడ్​తో 2009లో ఏర్పడ్డ విబేధానికి సంబంధించిన విషయం ఇదని తెలిపింది.

కంప్లెయింట్​దాఖలైందని నిజమే కానీ ఎఫ్​ఐఆర్​ నమోదు కాలేదని పేర్కొంది. ఎఫ్​ఐఆర్​లో హీరో మోటోకార్ప్​కు సంబంధించిన ఏ ఒక్క అధికారి పేరు లేదని స్పష్టం చేసింది. అకౌంట్లను తారుమారు చేయడం, మోసం, ఫోర్జరీ ఆరోపణలతో ముంజాల్​పై ఢిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్​ఫైల్​ చేసినట్లు రిపోర్టులు రావడంతో ఈ వివరణ ఇస్తున్నామని ప్రకటించింది.