ఆసక్తిరేపుతున్న వైష్ణవ్ తేజ్ మాస్ లుక్.. 

ఆసక్తిరేపుతున్న వైష్ణవ్ తేజ్ మాస్ లుక్.. 

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీతో ఎంట్రీ ఇచ్చి బిగ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో వైష్ణవ్ తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల జోడీగా నటిస్తోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ ఈ మూవీ డైలాగ్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. 

పోస్టర్ చూస్తుంటే మునుపెన్నడూ చూడని లుక్ లో వైష్ణవ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మాస్ డైలాగుతో మోషన్ టీజర్ ఆసక్తికరంగా ఉంది. 'రేయ్ రాముడు లంకమీద పడటం వినుంటావ్ అదే పది తలకాయలున్నోడు ఇంటిమీద పడితే ఎట్టుంటాదో సూస్తావా.. అంటూ విలన్ డైలాగ్ చెప్పగా.. నీ అయోధ్యలో వుండేడిది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్రకాళేశ్వరుడు..తలలు కోసి సేతికిత్తా నాయాలా... సూసుకుందాం రా...' అంటూ విలన్ ని ఉద్దేశించి వైష్ణవ్ తేజ్ చెబుతున్న డైలాగ్ లు ఓ రేంజ్ లో ఉంది. రాయల సీమ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సంభాషణల్లో యాసని బట్టి అర్థమవుతోంది. 

ఇక మోషన్ పోస్టర్ లో రుద్రకాళేశ్వరుడి త్రిశూలం.. డైలాగ్ మోషన్ పోస్టర్ ఎండింగ్ లో శివుడి వాహనమైన గోమాత పక్కన త్రిశూలం పట్టుకుని సీరియస్ లుక్ తో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఈ మూవీని 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో నటించే తారాగనం, సాంకేతిక విభాగం గురించి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.