ఇలాంటి ఫ్యాన్స్ లేనప్పుడు సినిమాలు ఎందుకు చేయాలి: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఎమోషనల్

ఇలాంటి ఫ్యాన్స్ లేనప్పుడు సినిమాలు ఎందుకు చేయాలి: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఎమోషనల్

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. సినిమా తప్ప తనకేమీ తెలియదని.. తెలిసుంటే ఇంత డెడికేటెడ్ గా ఇక్కడ సినిమాలు చేసేవాడిని కాదన్నారు. ఏం చేసినా ఫ్యాన్స్ కోసమేనని అన్నారు. విజయవాడలో జూన్ 01న జరిగిన ఈ వెంట్ లో ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 

మీ కోసం చేతులు ఇరక్కొట్టుకోవడం కాదు.. రక్తం చిందించైనా సినిమాలు చేస్తానని రామ్ చరణ్ అన్నారు. అభిమానులు ఇచ్చే ఎంకరేజ్ మెంట్, సపోర్ట్ తో.. వాళ్ల కోసం ఏమైనా చేయాలని అనిపిస్తుందని చెప్పారు. అభిమానుల నుంచి ఎంకరేజ్ మెంట్, ఎగ్జైట్ మెంట్ లేకేంటే ఎందుకు చేయాలి సినిమాలు అని ప్రశ్నించారు. అంత అభిమానం ఉంది కాబట్టే ఫ్యాన్స్ కోసం ఏమైనా చేయాలనిపిస్తుందన్నారు.

  • చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా..

 రాసిపెట్టుకోండి.. చనిపోయేవారకు సినిమాలు చేస్తా.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా.. అంటూ ఉర్రూతలూగించారు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు కావడమో లేక ఇంట్లో కళ్యాణ్ బాబాయ్ ఉండటమో కానీ.. సినిమాల కోసం ఏదైనా చేయాలనిపిస్తుందన్నారు. 

ఇక పెద్దికి బిగ్గెస్ట్ పిల్లర్ రెహమాన్ సర్ అని కొనియాడారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఫ్యూచర్ లో ఇండియాలోనే టాప్ 3, 4 డైరెక్టర్లలో ఒకరుగా ఉంటారని చెప్పుకొచ్చారు.