Tripti Dimri: యానిమల్ పాత్ర అంత ఫేమస్ అవడానికి కారణం చెప్పిన గ్లామర్ బ్యూటీ

Tripti Dimri: యానిమల్ పాత్ర అంత ఫేమస్ అవడానికి కారణం చెప్పిన గ్లామర్ బ్యూటీ

యానిమల్(Animal) సినిమాలో హీరోయిన్ గా నటించింది నేషనల్ క్రష రష్మిక మందన్నా(Rashmika Mandanna) అయినప్పటికి తన గ్లామర్ తో ఆడియన్స్ ను కట్టిపడేశారు తృప్తి డిమ్రి(Tripti Dimri). సినిమాలో కనిపించింది కాస్త సమయమే అయినప్పటికి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకి ముందు తృప్తి అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ, యానిమల్ తరువాత ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు అన్ని భాషల నుండి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇందులో భాగంగానే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె యానిమల్ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూ యాంకర్ యానిమల్ సినిమాలో తృప్తి పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. జోయా పాత్ర అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటని మీరనుకుంటున్నారు అని అడిగారు. దానికి సమాధానంగా  తృప్తి డిమ్రి మాట్లాడుతూ.. నా కెరీర్ లో జోయా పాత్ర చాలా ప్రత్యేకం. ఆ పాత్రలో బోల్డ్ నెస్ తోపాటు అమాయకత్వం, డిఫికల్ట్ కండిషన్స్ ని ఎలా డీల్ చేయాలనే లక్షణాలున్నాయి. అందుకే ఆ పాత్ర ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.. అని తెలిపారు తృప్తి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ALSO READ | Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్

తృప్తి డిమ్రి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె బ్యాడ్ న్యూస్, వికీ విద్య కా ఓ వాలా వీడియో, భూల్ భులాయ 3 లాంటి క్రేజీ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది తృప్తి. అంతేకాదు.. సౌత్ నుండి కూడా ఈ అమ్మడుకు అవకాశకు గట్టిగానే వస్తున్నాయట. అందులో మాస్ మహారాజ్ రవితేజతో  ఆమె చేయబోయే సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి యానిమల్ సినిమాలో తన పాత్రపై తృప్తి చేసిన కామెంట్స్ పై మీ ఒపీనియన్ ను కామెంట్ చేయండి.