Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్

Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్

ఇటీవలే మలయాళ ఇండస్ట్రీలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ప్రేమలు(Premalu). ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నస్లీన్‌(Naslin), మమితా బైజు(Mamitha baiju) జంటగా వచ్చిన ఈ సినిమాను గిరీష్ ఏడీ తెరకెక్కించగా.. భావన స్టూడియోస్ పై ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్, దిలీష్ పోతన్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ALSO READ | Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత

ఇక మలయాళంలో ప్రేమలు సినిమాకు వచ్చిన అనూహ్య స్పందనతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ విడుదల చేయడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కథ కూడా హైదరాబాద్ చుట్టూ తిరగడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో.. దుమ్ములేపే కలెక్షన్స్ రాబట్టింది ప్రేమలు. ఈ క్రమంలో మలయాళ టాప్ స్టార్స్ ని సైతం పక్కకు నెట్టేసి తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ప్రేమలు. తెలుగులో ఈ  సినిమా విడుదలై 20 రోజులు గడుస్తున్నా.. కలెక్షన్స్ జోరు మాత్రం అస్సలు తగ్గడంలేదు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ కావడం విశేషం. 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మలయాళం, తెలుగులో థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా మార్చ్ 29 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సౌత్ లాంగ్వేజెస్ తోపాటు హిందీలో కూడా అందుబాటులోకి రానుంది ఈ మూవీ. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ప్రేమలు సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడలి.