సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆస్ట్రేలియా

సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  ఆస్ట్రేలియా
  •  నేడు అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆసీస్ మ్యాచ్
  •  మ.2 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పోర్ట్స్‌‌‌‌ లో

ముంబై :  ఐదుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెమీఫైనల్ బెర్తుపై గురి పెట్టింది. మంగళవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి నేరుగా సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకోవాలని చూస్తోంది. గత పోరులో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించిన ఆసీస్ ప్రస్తుతం 10 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడాల్సిన కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కటి గెలిచినా 12 పాయింట్లతో నేరుగా సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకూ ఆగకుండా వాంఖడేలోనే అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని పట్టి నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టాలని ఆశిస్తోంది. మరో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మిగిలున్న అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8 పాయింట్లతో ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆఖరాటలో సౌతాఫ్రికాను ఢీ కొట్టనుంది. వీటిలో ఒక్కటి గెలిచినా పది పాయింట్లతో నాలుగో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తు కోసం రేసులోకి రానుంది. ఇప్పటికే డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు గత మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి జోష్​లో ఉంది. బలమైన కంగారూలపైనా నిర్భయంగా ఆడి ఫలితం రాబట్టాలని  అఫ్గాన్ ఆశిస్తోంది.