విద్యార్థులకు గుడ్ న్యూస్..మరింత ఈజీగా ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు

విద్యార్థులకు గుడ్ న్యూస్..మరింత ఈజీగా ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు

 

  • డిగ్రీ ఇంగ్లిష్​లో కొత్త సిలబస్ 
  •  తొలిసారిగా లెర్నింగ్ మెటీరియల్, వర్క్ బుక్ 
  • బేసిక్స్ నుంచి ప్రొఫెషనల్ వరకు పాఠాలు 
  • నాలుగు సెమిస్టర్లలో 20 క్రెడిట్స్ 

హైదరాబాద్,వెలుగు:  డిగ్రీలో ఇంగ్లిష్ సబ్జెక్టును మరింత సులభతరం చేసేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్​ఈ) చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా డిగ్రీ ఇంగ్లిష్​ కొత్త సిలబస్​ను తీసుకొచ్చింది. నాలుగు సెమిస్టర్ల సిలబస్ ను రెడీ చేసి, యూనివర్సిటీలకు పంపించింది. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో ఇంగ్లిష్ సబ్జెక్టు సిలబస్​పై కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనిలో ఇంగ్లిష్ సబ్జెక్టు ఎక్స్ పర్ట్​లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌లు పాల్గొన్నారు. సిలబస్​ను ఫైనల్ చేశారు. విద్యార్థులకు ఇంగ్లిష్‌‌‌‌ను మరింత సులభతరం చేసే లక్ష్యంతో  స్కిల్స్ బెస్డ్ సిలబస్‌‌‌‌ను రూపొందించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ –2020 గైడ్​లైన్స్ కు తగ్గట్టు మార్పులు చేశారు. 

స్టూడెంట్లకు లెర్నింగ్ మెటీరియల్

కొత్త సిలబస్ అమలులో భాగంగా.. విద్యార్థులకు తొలిసారిగా ప్రత్యేక లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.200 పేజీల మెటీరియల్ ఇవ్వనున్నారు. దీనికితోడు ఒక్కో యూనిట్ ను, సబ్జెక్టు ఎక్స్ పర్ట్ ఆడియోనూ అందించనున్నారు. టీసాట్ ద్వారా ఓరియంటెషన్ క్లాసులనూ ఇప్పించేలా ప్లాన్ చేశారు. వర్క్ బుక్​నూ స్టూడెంట్లకు అందించనున్నారు. టీచర్లకూ ఉపయోగపడేలా స్పెషల్ హ్యాండ్ బుక్ కూడా ఇవ్వనున్నారు. 

సిలబస్​లో తెలంగాణ సంస్కృతి, చరిత్ర

ఇంగ్లిష్ కొత్త సిలబస్‌‌‌‌లో బేసిక్ స్కిల్స్ నుంచి ప్రొఫెషనల్ ఆర్టికల్స్ రాసేలా స్టూడెంట్లకు తర్ఫీదు ఇవ్వనున్నారు. ఉద్యోగ అవకాశాల్లో ఉపయోగపడేలా కొత్త సిలబస్ ను రూపొందించారు. నిజజీవిత పరిస్థితుల్లో ఉపయోగించే ఇంగ్లిష్‌‌‌‌పై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాట్లాడటం, రాయడం, చదవడంపైనా దృష్టి పెట్టారు. ఫస్ట్ సెమిస్టర్​లో బేసిక్ ఫౌండేషన్ స్కిల్స్ తో పాఠాలు ప్రారంభమై.. వ్యాసాల రచన వరకూ పాఠాలు పెట్టారు. సిలబస్ లో తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలు,  చర్రితను పెట్టారు. ఇంగ్లిష్ సబ్జెక్టు నాలుగు సెమిస్టర్లకు తయారు చేయగా, ఒక్కో సెమిస్టర్​కు ఐదు క్రెడిట్స్ చెప్పున మొత్తం 20 క్రెడిట్స్ ఉండనున్నాయి. 

అందరికీ అర్థమయ్యేలా సిలబస్

డిగ్రీ ఇంగ్లిష్ సిలబస్​ అందరికీ అర్థమయ్యేలా రూపొందించాం. సిలబస్ ను ‘లైట్ బట్ టైట్’ అంటే తక్కువ కంటెంట్.. స్పష్టమైన సబ్జెక్టు అనే రీతిలో తయారు చేశాం.  యూజీసీ,ఎన్ఈపీ మార్గదర్శకాలకు తగ్గట్టు సిలబస్​, క్రెడిట్స్ ను పెట్టాం. స్టూడెంట్లకు ప్రతి యూనిట్ కు 20 పేజీల లెర్నింగ్ మెటిరియల్, వర్క్ బుక్ అందించనున్నారు. సబ్జెక్టుతో పాటు స్కిల్స్ నూ నేర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. 
-బాలకిష్టారెడ్డి, టీజీసీహెచ్ఈ చైర్మన్