ఖర్గేతో హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ భేటీ

ఖర్గేతో హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్  భేటీ

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సమావేశమయ్యారు. ఇటీవల గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్ ఖర్గేను కలిశారు. ధన్యవాదాలు తెలిపేందుకే ఢిల్లీ వచ్చామని సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు.

ప్రధాని అపాయింట్ మెంట్ కోరానని.. అనుమతిస్తే ప్రధానిని కలుస్తానని సుఖ్విందర్ సింగ్ సుఖు వెల్లడించారు. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఇటీవలే ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు.