ఎల్​ఐసీలో హిందీ ప్రచార కార్యక్రమం

ఎల్​ఐసీలో హిందీ ప్రచార కార్యక్రమం

హైదరాబాద్, వెలుగు: హిందీ భాష ప్రచారంలో భాగంగా నగరంలోని ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ రీజినల్ ఆఫీసులో ఈ నెల 14  నుంచి 29 వరకు హిందీ ప్రచారం నిర్వహించారు. భారత ప్రభుత్వ అధికార భాషా శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హిందీ దివస్ సందర్భంగా ఈ నెల 14 న హిందీ పక్షం ఉత్సవాలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఉద్యోగులతో అధికారిక భాష ప్రతిజ్ఞ చేయించారు.