గవర్నర్ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు

గవర్నర్ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు

అది గవర్నర్ నివాసం రాజ్ భవన్.. అర్థరాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. NIAకు ఓ గుర్తు తెలియని.. నెంబర్  కనిపించని ఫోన్ వచ్చింది.. రాజ్ భవన్ లో బాంబు పెట్టాం.. అది ఏ క్షణమైనా.. ఎప్పుడైనా పేలిపోతుంది అని ఆ ఆగంతకుడు చెప్పాడు.. అప్రమత్తం అయిన ఎన్ఐఏ అధికారులు.. ఈ వివరాలను సిటీ పోలీసులకు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అర్థరాత్రి.. పోలీసులను పరుగులు పెట్టించింది.

2023, డిసెంబర్ 12వ తేదీ వస్తున్న సమయంలో.. ఎన్ఐఏ నుంచి వచ్చిన సమాచారంతో బెంగళూరు సిటీ పోలీసులు రాజ్ భవన్ మొత్తాన్ని జల్లెడ పట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేశారు. మూడు గంటలు.. రాజ్ భవన్ మొత్తం తనిఖీల తర్వాత.. ఎలాంటి బాంబు లేదని డిక్లేర్ చేశారు. ఎవరో కావాలని ఈ ఫోన్ కాల్ చేసినట్లు భావిస్తున్నారు బెంగళూరు పోలీసులు. ప్రస్తుతం NIAకు వచ్చిన ఫోన్ కాల్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. 

వారం క్రితం.. బెంగళూరులోని 44 ప్రైవేట్ పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు ఇదే తరహా ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడు రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు.. స్కూల్స్ లో బాంబులు పెట్టినట్లు చెప్పిన వ్యక్తి వివరాలు ఇప్పటి వరకు తెలియలేదు.. ఆ కేసు విచారణ నడుస్తూనే ఉంది.. ఎవరినీ గుర్తించలేదు.. అనుమానితులు సైతం దొరకలేదు.. ఈ కేసు నడుస్తున్న సమయంలో.. ఇదే తరహాలో మరో ఫోన్ కాల్.. ఈసారి బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోవటానికి ప్రత్యేక టెక్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.. ఎందుకంటే.. రేపు మరో ఫోన్ కాల్ రావొచ్చు కదా అని...