పూల కుండీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి.. ఎప్పుడైనా ఆలోచించారా

పూల కుండీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి.. ఎప్పుడైనా ఆలోచించారా

నగరాల్లో ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి ..  అందమైన పువ్వులు పెంచడానికి ఒక చిన్న తోటను తయారు చేయగల భూమి లేదు. అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారు  బాల్కనీలో కుండీలను ఏర్పాటు చేసుకొని మొక్కలు పెంచుకుంటారు. అయితే ఈ కుండీలకు కింది భాగంలో రంధ్రాలుంటాయి.అసలు  పూల కుండీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 

కుండీలకు  డ్రైనేజ్ హోల్స్

జనాభా పెరుగదలతో కాస్తంత చోటు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది.  అందుకే జనాలు అపార్ట్ మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.  బాల్కనీల్లో  కుండీల్లో మొక్కలు పెంచుకుంటున్నారు.  ఈ కుండీలకు అడుగున చిన్న రంధ్రం ఉంటుంది. 'గార్డెనింగ్ నో హౌ' వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం  మొక్కల కుండీలకు ఉన్న రంధ్రాలను  డ్రైనేజ్ హోల్స్ అంటారు.  కుండీలలోని రంధ్రాలు మొక్కల పెరుగుదలకు  చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి మొక్కలను ఆరోగ్యంగా ఉంచుతాయి.. 

మన ఇంట్లో  షింక్ దగ్గర వాటర్ నిల్వ ఉండకుందా వెళ్లేందుకు ఎలాంటి సిస్టమ్ ఉందో ఒక సారి ఊహించుకుంటే అర్దమవుతుంది. వేస్ట్ వాటర్ బయటకు వెళ్లే విధంగా అక్కడ రంధ్రాలు ఏర్పాటు చేసినట్టే... మొక్కలు పెంచే కుండీల్లో కూడా నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కింద భాగాన రంధ్రాన్ని ఏర్పాటు చేస్తారు.  

వేస్ట్ వాటర్ వెళ్లేందుకు..

ఈ డ్రైనేజీ రంధ్రాలు లేని కుండీలలోని మొక్కలు త్వరగా చనిపోతాయి.   దీనికి కారణం అధిక మొత్తంలో నీరు నిల్వ ఉండి కుళ్లిపోతాయి. అవి ఇతర మొక్కలను కూడా పెరగనీయకుండా చేస్తాయి. మొక్కలకు కొంత వరకు మాత్రమే నీరు అవసరం. అవసరమైన దానికంటే ఎక్కువ నీరు చేరితే, అవి చనిపోతాయి. ఎక్కువ ఉన్న నీరు డ్రైనేజి రంధ్రాల ద్వారా బయటకు పోతుంది.

నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు.. 

అనేక మందికి ఇళ్లలో కుండీల్లో మొక్కలు పెంచడమంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. దీంతో కొత్త, ఆకర్షణీయమై, ఇష్టమైన అనేక మొక్కలను ఇంటికి తీసుకువస్తారు. కానీ ఎలా పెంచాలన్న అంశంపై సరైన అవగాహన లేక ఇబ్బంది పడుతుంటారు. దీంతో కొన్ని సార్లు మొక్కలు చనిపోతుంటాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే అలాంటి ఇబ్బంది ఉండదు.- అనేక మంది నర్సరీల నుంచి మొక్కలు తీసుకు వచ్చిన వెంటనే దానిని కుండీలలో నాటడం చేస్తారు. కుండీ ఎలా ఉందనే విషయాన్ని సరిగా పట్టించుకోరు. దీంతో ఇబ్బంది ఎదరువతుంది. కుండీలో మొక్కను నాటే ముందు దాని అడుగు భాగాన చిన్న రంధ్రం ఉండేలా చూసుకోవాలి. కుండీలో నీరు ఎప్పుడూ నిల్వ ఉండకుండా చూడాలి. కుండీ అడుగుభాగాన రంధ్రం నుంచి నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలి. నీరు నిలిచిపోతే మొక్క చనిపోయే ప్రమాదముంటుంది.