చితి మధ్యలో.. చితా భస్మంతో హోలీ ఆడతారు... ఎక్కడంటే...

చితి మధ్యలో.. చితా భస్మంతో హోలీ ఆడతారు... ఎక్కడంటే...

హోలీ రంగురంగుల పండుగ. ఈరోజు హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 24వ తేదీన రానుంది. అయితే, సాధారణంగా హోలీని గులాల్ రంగులతో ఆడతారు. కానీ, మన దేశంలోని ఈ ప్రాంతంలో మాత్రం హోలీని చితాభస్మంతో ఆడతారు ఆ ప్రదేశం ఏంటో తెలుసుకుందాం.

హోలీ రంగురంగుల పండుగ. ఈరోజు హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 25వ తేదీన రానుంది. అయితే, సాధారణంగా హోలీని గులాల్ రంగులతో ఆడతారు.ఫాల్గుణమాసంలో వచ్చే పూర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఈరోజు ప్రభుత్వ సెలవుదినంగా కూడా పాటిస్తారు. కాశీలో మాత్రం హోలీని రంగులతోకాకుండా బూడిదతో ఆడతారు. 

ALSO READ :- Pallavi Prashanth: రాజకీయాలంటే రస్నా తాగడం అనుకున్నావా.. పల్లవి ప్రశాంత్పై నెటిజన్స్ ఫైర్

విశ్వనాథుడు సతీ సమేతంగా కాశీలో అడుగుపెట్టిన రోజు

పురాణాల ప్రకారం ఒకనాడు పార్వతిదేవితో శివుడు కాశీకి వచ్చాడు అయితే,అందరూ తమ బంధువులు, స్నేహితులతో రంగులు ఆడటం చూశాడు. స్మశానంలో మాత్రం ఆత్మలు, దయ్యాలు, గంధర్వులు ఈ వేడుకలు జరుపుకోలేకపోయాయి. ఆ తర్వాత హోలీ ముందు వచ్చే ఏకాదశి నుంచి శివుడు శ్మశానవాటిలో నివసించే ఆత్మలు , దయ్యాలు, పిశాచాలతో  చితాభస్మంతో హోలీ ఆడాడని పురాణాలు చెబుతున్నాయి.  కాశీలో మాత్రమే చితాభస్మంతో హోలీ జరుపుకుంటారు. మణికర్ణిక, ఘాట్ లో హరహర మహాదేవ అంటూ ఒకరికొకరు చితాభస్మాన్ని సమర్పించుకుంటారు.

శ్మశాన హోలీ ప్రత్యేకత

శ్మశాన హోలీ జరుపుకోవడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కాశీలో హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితి మంటలు 24 గంటలు మండుతూనే ఉంటాయి. ఈ ఘాట్ లో ఏకాదశి రోజు చితాభస్మాన్ని చల్లుకోవడంతో హోలీ వేడుకలకు మొదలుపెడతారు. ఈ సమయంలో నాగ సాధువులు  పాన్, బంగ్ అనే మత్తు కలిగించే పదార్థం తీసుకుంటారు. దీనినే పరమేశ్వరుడి మహాప్రసాదంగా భావిస్తారు. వేడుకకు ముందు చితికి మంగళహారతి ఇచ్చి ఢమరుకం మోగించి పంచాక్షరి మంత్రాన్ని దిక్కులు పిక్కటిల్లేలా జపిస్తారు. కేవలం మణికర్ణికా ఘాట్ లో మాత్రమే కాదు ఆ బూడిదను కాశీ విశ్వనాథుడి దేవాలయంలోకి  కూడా తీసుకెళతారు.

ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు హోలీ జరుపుకుంటారు. దీనినే హోలీ, కామదహనం, కానుని  పున్నమి, డోలికోత్సవం అంటారు. దేశ వ్యాప్తంగా ఒక్కరోజు జరిగే ఈ వేడుకను పరమేశ్వరుడు కొలువైన కాశీలో మాత్రం ఐదురోజుల ముందుగా ఏకాదశి రోజు  నుంచే మొదలవుతుంది. అయితే హోలీ వేడుకలు అంటే ఎక్కడైనా రంగులు, రంగు నీళ్లతో జరుపుకుంటే కాశీలో మాత్రం చితా భస్మంతో జరుపుకుంటారు. ఈ వినూత్న వేడుక చూసేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశీయులు సైతం బారులుతీరుతారు. దీనినే శ్మశాన హోలీ అంటారు.

విశ్వనాథుని సన్నిధిలో బూడిదతో రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకోవడం వల్ల దయ్యాలు, పిశాచాల బెడద తొలగిపోతుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ భిన్నమైన వేడుకలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.