పంటలను పరిశీలించిన హార్టికల్చర్​ స్టూడెంట్స్

పంటలను పరిశీలించిన హార్టికల్చర్​ స్టూడెంట్స్

అశ్వారావుపేట వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో హార్టికల్చర్​ స్టూడెంట్స్​ పర్యటించి పంటలను పరిశీలించారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన కళాశాల రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి ఉద్యాన విద్యను చదువుతున్న 92 మంది విద్యార్థులు మూడు రోజులపాటు మండలంలోని పలు పంటలను సందర్శించారు.

ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, శతవరి, జామ, మామిడి, అరటి, వివిధ రకాల కూరగాయల తోటల సాగు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధన స్థానాన్ని సందర్శించి అక్కడ సాగు చేస్తున్న మామిడి, జామ, మిరియాలు, జీడి మామిడి, కొబ్బరి, తమలపాకు, కాఫీతోపాటు అనేక రకాల కూరగాయల మొక్కలను పరిశీలించారు. పరిశోధన వివరాలను శాస్త్రవేత్త డాక్టర్​ విజయ క్రిష్ణను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్​మజ్జిగ శ్రీనివాస్,  టీ. మమత టీచింగ్ అసోసియేట్, ఏఈఓ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.