షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు దగ్ధం.. కాలిపోయిన మూడు లక్షల నగదు

షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు దగ్ధం.. కాలిపోయిన మూడు లక్షల నగదు

కడెం, వెలుగు : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధం అయింది. కడెం మండలంలోని పాండ్వా పూర్  గ్రామంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండ్వాపూర్ గ్రామానికి చెందిన ఆర్సం రాజన్న ఇంట్లో విద్యుత్  షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో ఇంట్లోని రూ.3 లక్షల నగదు, బంగారం, బట్టలు సామగ్రి పూర్తిగ కాలిపోయాయి. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు ఫైరింజన్ కు సమాచారం ఇచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.