లేడీస్ కొత్త ట్రెండ్ : టూత్ స్టడ్స్.. పళ్లకు బంగారం, వజ్రాల ఆభరణాలు

లేడీస్ కొత్త ట్రెండ్ : టూత్ స్టడ్స్.. పళ్లకు బంగారం, వజ్రాల ఆభరణాలు

ఒకప్పుడు ఫ్యాషన్ గా కనిపించాలంటే.. చాలా సంకోచించేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జుట్టు నుంచి కాలి బొటనవేలు వరకు అన్ని పార్ట్స్ ను ఫ్యాషన్ గా కనిపించేలా అలంకరిస్తున్నారు. అందుకు వెరైటీ డ్రెస్సులు, ఆభరణాలు, హెయిర్ స్టైల్స్ లో కనిపిస్తూ పాపులర్ అవుతున్నారు. తాజాగా ఈ ఫ్యాషన్ రంగంలోకి మరో కొత్త వెరైటీ వచ్చేసింది. అదే బాడీ జ్యువెల్లరీ.

ఇంతకీ బాడీ జ్యువెల్లరీ అంటే ఏంటీ అనుకుంటున్నారా.. అదేదో బ్రహ్మ పదార్థం అనుకుంటున్నారా.. అదేం లేదండీ.. ఇది మనందరికీ తెలిసిందే. కాకపోతే ఓ కొత్త పేరుతో ట్రెండింగ్ అవుతుందంతే. ఇంతకీ బాడీ జ్యువెల్లరీ అంటే ఏంటా అని చిరాకు పడ్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. బాడీ జ్యువెల్లరీ అంటే బాడీలోని పార్ట్స్ ను జ్యువెల్లరీతో అలంకరించడమన్నమాట. అంటే మామూలుగా మనం చెవులకు జుంకాలు, ముక్కుకు పుడక ధరించినట్టే.. ఇతర భాగాల్లోనూ ఆభరణాలతో అలంకరించడన్నమాట. కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో కనిపించే యాక్టర్స్ లేదా ఇతర హీరోయిన్లు తమ బొడ్డుకు, నాలుకపై, కళ్లపై స్టడ్స్ లాంటి జ్యువెల్లరీతో కనిపించడం చూశాం కదా అలా అన్నమాట. కానీ ఈ సారి మాత్రం ఈ ఫ్యాషన్ ఇంకా మితిమీరింది. అది నాలుక నుంచి పళ్లకు పాకింది. అవును మీరు విన్నది నిజమే. పళ్లను స్టోన్స్, ఇతర స్టడ్స్ తో అందంగా కనిపించేలా చేయడం ఇప్పటి ట్రెండ్ అంట.

ఇలా కూడా పెట్టుకుంటారా అన్న సందేహం వస్తుందా.. అవును. ఈ ట్రెండ్ ప్రస్తుతానికైతే న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లాంటి ప్రధాన నగరాల్లో బాగా కనిపిస్తోంది. సెలబ్రెటీలు, ప్రముఖులు, ఫ్యాషన్ ను ఫాలో అయ్యే వాళ్లంతా ఇలా తమకిష్ణమైన వజ్రాలు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం వంటి వాటితో చేసిన జ్యువెల్లరీని తమ ఒంటిపై కనిపించేలా అలంకరించుకుంటున్నారు.