బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో కంటెస్టెంట్స్ పోటాపోటీగా తమ ఆటతీరును రక్తికట్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు పంచులు, డైలాగ్స్, ట్విస్ట్‌లు, కొట్లాటలు.. ఇలా ఉత్కంఠ రేపే ఎపిసోడ్స్ తో సీజన్ 9 నడుస్తుంది. ప్రస్తుతం ఈ షో 8 వారాలు కంప్లీట్ చేసుకుంది. 8 వారం నామినేషన్లో భాగంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది.
రీతూ, తనూజా, కళ్యాణ్, డెమోన్, సంజన, రామూ, గౌరవ్, మాధురి ఉండగా, చివరకు దివ్వెల మాధురి హౌస్ నుంచి బయటకి వచ్చేసింది. చివరి రెండు స్థానాల్లో ఉన్న గౌరవ్ గుప్తా, దివ్వెల మాధురి మధ్య పోరు తీవ్రంగా ఉండటం.. ఇందులో మాధురికి అతి తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ క్రమంలో మాధురి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
దివ్వెల మాధురి రెమ్యునరేషన్:
దివ్వెల మాధురి సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. కేవలం మూడు వారాలు మాత్రమే హౌస్ లో ఉండి ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది. తన ఆటతీరులో పవర్ ఫుల్ డైలాగ్స్, ఎదురించే స్ట్రాటజీ, ఎమోషన్ వంటి అంశాలతో ఆడియన్స్ పై చెరగని ముద్ర వేసింది. ఈ క్రమంలో (2025 అక్టోబర్ 12న) వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మాధురి 22 రోజుల్లో ఎంత సంపాదించింది? ఆ డబ్బును ఏం చేయబోతుందో తెలుసుకుందాం.
►ALSO READ | పెళ్లి తర్వాత థ్రిల్ చేసేలా... ప్రేమంటే
బిగ్ బాస్ ఎంట్రీ ముందే దివ్వెల మాధురికి సోషల్ మీడియాలో మంచి ఫాల్లోవింగ్ ఉంది. ఈ క్రమంలో మాధురికి భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. వారానికి రూ.2 నుంచి 3 లక్షలు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అలా మొత్తం 22 రోజులకు గాను రెమ్యునరేషన్ కింద ఆమె రూ.8 నుంచి 9లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, మాధురి కేవలం వారానికి రూ.40 వేలు మాత్రమే అందుకున్నారని.. అలా మొత్తం 22 రోజులకు గాను సుమారుగా లక్ష 20 వేల రూపాయలు లేదా రూ.1,25000 సంపాదించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అయితే, రెమ్యునరేషన్ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ.. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా మాత్రం దివ్వెల మాధురి నిలిచింది.
It’s time to say goodbye! #Madhuri bids farewell to the Bigg Boss house! 👁️⚡️
— Starmaa (@StarMaa) November 2, 2025
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/l5gTbToKn0
సేవా కార్యక్రమాలకు మాధురి రెమ్యునరేషన్:
దివ్వెల మాధురి మూడు వారాలకు గాను తీసుకున్న పారితోషకాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని ముందుగానే చెప్పింది. అలా వికలాంగులు, క్యాన్సర్ రోగుల కోసం తమ వంతు సాయంగా ఈ డబ్బులు వితరణ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏదేమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9 లో దుమ్మురేపి వెళ్లిందని చెప్పుకోవాలి.
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్:
బిగ్ బాస్ సీజన్ 9లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ చూసుకుంటే.. కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, భరణి శంకర్, రమ్య మోక్ష ఎలిమినేట్, దివ్వెల మాధురి ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇందులో ఎలిమినేట్ అయిన భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చి పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా సెటిల్ అయ్యాడు.
