పెళ్లిళ్ల సీజన్ కదా.. డైట్ ఎలా ఫాలో అవ్వాలి.. ఏం తినాలి.. ఎలా తినాలి

పెళ్లిళ్ల సీజన్ కదా.. డైట్ ఎలా ఫాలో అవ్వాలి.. ఏం తినాలి.. ఎలా తినాలి

పెండ్లి రోజున అందంగా, హుషారుగా కనిపించాలి. గెస్ట్ ల ముందు నవ్వుతూ ఉండాలి. అనుకుంటారు అమ్మాయిలు. కానీ, పెండ్లి పనులు, హడావిడి కారణంగా అలసిపోతారు.

పెండ్లికి ముందు రోజు నుంచి సరైన ఫుడ్ తినకపోవడమే అందుకు కారణం అంటోంది న్యూట్రిషనిస్ట్ నియామి అగర్వాల్. వెడ్డింగ్ డే నాడు ఎనర్జిటిక్గా ఉండేందుకు నియామి చెబుతున్న డైట్ టిప్స్ కొన్ని...

• ఆకలి వేసినప్పుడు క్యాలరీలు ఎక్కువ ఉండే బిస్కెట్లు, ఫుడ్ తినొద్దు. వీటి బదులు బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు తినాలి. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మం, వెంట్రుకలు హెల్దీగా కనిపించేలా చేస్తాయి. 

• చాలామంది పెండ్లిరోజున సరిపోను నీళ్లు తాగరు. దాంతో ముఖమంతా డల్ గా అవుతుంది. అలాకాకుండా, నీళ్లు సరిపోను తాగితే ఫ్రెష్ గా కనిపిస్తారు.

• పెండ్లికి ముందు రోజు డైజెషన్ సమస్యలు రాకుండా ఉండాలంటే బొప్పాయి తినాలి. చియాసీడ్స్ వేసిన ఒక గ్లాస్ నీళ్లు తాగినా యాక్టివ్ గా ఉంటారు. వీటితో పాటు పెరుగు కూడా తినాలి. దాంతో ఎనర్జీని ఇచ్చే క్యాల్షియం, ప్రొటీన్లు అందుతాయి.

• డైట్ లో వెజిటబుల్ జ్యూస్ తప్పనిసరిగా ఉండాలి. క్యారెట్లు, బీట్ రూట్, టోమాటోలతో తయారుచేసిన జ్యూస్ తాగితే చర్మం మెరుస్తుంది.